Begin typing your search above and press return to search.
చోటాను చంపేస్తాం
By: Tupaki Desk | 8 Nov 2015 6:44 AM GMTచోటా రాజన్ అరెస్టవడం మాఫియా డాన్ లలో కదలిక తెస్తోంది. చోటా అరెస్టవడంతో మిగతా డాన్ లంతా భయపడి సేఫ్ జోన్ లోకి వెళ్లిపోవడమో లేదా తప్పించుకుతిరగడమో చేస్తున్నారా అనుకునేరు. కానే కాదు. చోటా రాజన్ అరెస్టు నేపథ్యంలో తమ పగా, ప్రతికారాలను మీడియాకెక్కి ప్రకటిస్తున్నారు. చోటా రాజన్ అరెస్టయినప్పటినుంచి చెప్తున్న పదం... "దావూద్ నుంచి నాకు ప్రాణహాని ఉంది" అని. అదే స్టేట్ మెంట్ నిజమని తాజాగా తేలింది. దావుద్ కుడిభుజం, డీ గ్యాంగ్ లో నంబర్ 2 అయిన చోటా షకీల్ ఈ మేరకు కన్ఫర్మ్ చేశాడు. దాదాపు 25 ఏళ్లుగా తమకు ఛోటా రాజన్ తో శత్రుత్వం ఉందని..త్వరలోనే ఆయన్ను లేపేయడం ఖాయమని ప్రకటించాడు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 1993 నాటి ముంబై వరుస పేలుళ్ల నాటి ఘటనలు ప్రస్తావిస్తూ అదే తాము రాజన్ పై పగ పెంచుకునేందుకు కారణమని షకీల్ తెలిపాడు. ఆ పేలుళ్లు జరిగిన ఐదేళ్ల తర్వాత తమ టీంకు చెందిన ఆరుగురిని ఛోటా రాజన్ గ్యాంగు చంపేసిందని షకీల్ పేర్కొంటూ అది తమకు తీవ్ర అవమానంగా చెప్పాడు.
అంతేకాకుండా ఆ హత్యలో చనిపోయిన వారిలో దావూద్ ఇబ్రహీంతో పాటు తన కు సన్నిహితుడు అయిన మజీద్ ఖాన్ మరణం తమను ఇంకా కలిచివేస్తోందని షకీల్ గుర్తుచేశాడు. తమకు జరిగిన ఈ అవమానం నేపథ్యంలో తమ డీ గ్యాంగ్ లో ఇప్పటికే రాజన్ హత్యకు స్కెచ్ వేశామని, త్వరలోనే రాజన్ ను లేపేయడం ఖాయమని డిసైడ్ చేశాడు. పనిలో పనిగా ఈ లక్ష్యం(?) సాధించడం కోసం భగవంతుడి ప్రార్థించాడు. రాజన్ ను చంపే శక్తి ఇవ్వాలంటూ "అల్లా"ను ప్రార్థించాడు.
చోటా రాజన్ పై కేసులన్నీ ముంబైలోనే ఉన్నప్పటికీ సీబీఐ విచారణకోసం ముంబై పోలీసులకు అప్పగించకుండా ఉండటాన్ని షకీల్ తప్పుపట్టాడు. సీబీఐ వాళ్లకు రాజన్ ఏమైనా చుట్టమా లేదా ముంబై పోలీసులంటే వేరే అభిప్రాయం ఏమైనా ఉందా అంటూ నిలదీశాడు.