Begin typing your search above and press return to search.
చుర్రుమనిపిస్తున్న చికెన్.. వానా కాలంలోనే ఇంత రేటెందుకు?
By: Tupaki Desk | 20 July 2021 5:04 AM GMTరోటీన్ కు భిన్నంగా చికెన్ ధర కొండెక్కి కూర్చుంది. సాధారణంగా వేసవిలో కోళ్ల ఉత్పత్తి తక్కువగా ఉండటం.. ధర భారీగా పెరగటం మామూలే. అందుకు భిన్నంగా వానాకాలంలో చికెన్ ధర పెరగటంతో వినియోగదారుల జేబుల మీద భారం పడుతోంది. అంతకంతకూ పెరుగుతున్న చికెన్ ధరతో సామాన్యులకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా మార్కెట్ లో చికెన్ ధర కేజీ రూ.250 - 270 మధ్య నడుస్తోంది. ఎందుకిలా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
వేసవితో పోలిస్తే.. వానాకాలంలో కోళ్ల ఎదుగుదల ఎక్కువగా ఉండటమే కాదు.. ఉత్పత్తి కూడా ఎక్కువని చెబుతుంటారు. ఈ సమయంలో చికెన్ ధర తక్కువగా ఉండటం మామూలే. అందునా.. కరోనా దెబ్బకు కోళ్ల మార్కెట్ అతలాకుతలం కావటమే కాదు.. ఒక దశలో కోళ్లను ఉచితంగా పంచేయటం.. వేలాది కోళ్లను గోతులు తీసి మరీ పాతి పెట్టటం లాంటి ఉదంతాలు చోటు చేసుకోవటం తెలిసిందే.
గత ఏడాది లాక్ డౌన్ సమయంలో కేజీ చికెన్ కేవలం రూ.120 మాత్రమే ఉండేది. అయితే.. ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తినాలని చెప్పటం.. చికెన్ తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్న విషయంపై ప్రజల్లో అవగాహన పెరిగిన తర్వాత.. చికెన్ వినియోగం పెరిగింది. అయినప్పటికీ.. ధరలు మాత్రం కొండెక్కి కూర్చోలేదు. ఇటీవల కాలంలో చికెన్ వినియోగం పెరగటం.. అందుకు తగ్గట్లుగా ఉత్పత్తి లేకపోవటంతో ధరలు పెరుగుతున్నట్లుగా వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
అయితే.. అందులో నిజం లేదని.. వ్యాపారులు కుమ్మక్కై మార్కెట్ లో కావాలనే కొరతను తీసుకొస్తున్నారని.. అందుకు ధరలు ఇంతలా మండుతున్నాయని చెబుతున్నారు. ఆదివారం హైదరాబాద్ లో కేజీ చికెన్ రూ.280 వరకు పలికింది.
నేరుగా కోడిని కొంటే మాత్రం కిలో 170కే అమ్ముతున్నారు. స్కిన్ లెస్ అయితే మాత్రం రేటు భారీగా పెరిగింది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చికెన్ ధర ఇంతలాపెరగటానికి కారణం.. తాజాగా బోనాల సీజన్ నడుస్తుండటం.. లాక్ డౌన్ తర్వాత నెమ్మదిగా ఒకటి తర్వాత ఒకటి చొప్పున హోటళ్లు.. రెస్టారెంట్లు తెరవటం.. పూర్తిస్థాయిలో పని చేయటం మొదలు కావటంతో చికెన్ వినియోగం పెరిగినట్లు చెబుతున్నారు. ఈ కారణంగానే చికెన్ ధరకు రెక్కలు వచ్చినట్లుగా తెలుస్తోంది.
తెలంగాణలో చికెన్ వినియోగం రోజువారీగా చూస్తే 12 నుంచి 16 వేల క్వింటాళ్లుగా చెబుతారు. తాజాగా మాత్రం 10 వేల క్వింటాళ్ల కంటే తక్కువగానే చికెన్ ఉత్పత్తి అవుతోందని.. ఇదే ధరలు పెరగటానికి ప్రధాన కారణమని చెబుతున్నారు. తెలంగాణలో బ్రయిలర్ కోళ్ల పెంపకం సామర్థ్యం నెలకు 2.40కోట్లు కాగా.. ఇప్పుడు 1.90 కోట్లు మాత్రమే ఉన్నాయని.. దీంతో రేట్లు పెంచేశారని చెబుతున్నారు. దీనికి తోడు.. కోళ్ల దాణా కూడా ఈ మధ్యన విపరీతంగా పెరిగాయని.. ఇది వ్యాపారులకు అదనపు భారంగా మారినట్లు చెబుతున్నారు. ఇదే.. చికెన్ ధర పెరగటానికి మరో కారణంగా చెబుతున్నారు. మార్కెట్లో చికెన్ ఉత్పత్తి భారీగా పెరిగే వరకు ధరలు తగ్గే అవకాశం లేదన్న మాట వినిపిస్తోంది.