Begin typing your search above and press return to search.

చిదంబరం నల్లకోటు వేసుకున్నా నో యూజ్

By:  Tupaki Desk   |   1 March 2016 5:18 AM GMT
చిదంబరం నల్లకోటు వేసుకున్నా నో యూజ్
X
యూపీఏ సర్కారులో కీలకపాత్ర పోషించిన కేంద్రఆర్థికమంత్రి చిదంబరం తలపండిన రాజకీయ నాయకుడే కాదు.. సీనియర్ న్యాయవాది కూడా. ఆయన కానీ కేసు టేకప్ చేశారంటే లెక్కలు మారిపోతాయని చెబుతుంటారు. అలాంటి చిదంబరం చాలాకాలం తర్వాత నల్లకోటు వేసుకొని కోర్టులో ఒక కేసు గురించి వాదించారు. చిదంబరం లాంటి వ్యక్తి స్వయంగా రంగంలోకి దిగితే.. మొత్తం సీనే మారిపోవాలి. కానీ.. అలాంటిదేమీ చోటు చేసుకోలేదు.

చాలాకాలం తర్వాత నల్లకోటు వేసుకొని.. స్వయంగా కోర్టుహాలులో ఒక కేసుకు సంబంధించి వాదనలు వినిపించినా.. ఫలితం కనిపించకపోవటం ఆయన్ను తీవ్ర నిరాశకు గురి చేసిందని చెబుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తులకు సంబంధించిన కేసులో దాల్మియా సిమెంట్స్ అధినేత పునీత్ దాల్మియాకు సంబంధించిన కేసు విచారణకు వచ్చింది.

ఈ కేసులో ‘‘దాల్మియా’’ తరఫున వాదించేందుకు కోర్టుకు వచ్చిన చిదంబరం.. సదరు కేసు సీబీఐ కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో.. ఈడీ ముందు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేయటం ఏమిటంటూ పాయింట్ తీసి మరీ చిదంబరం వాదనను వినిపించారు. అయితే.. చిదంబరం వాదలకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు సానుకూలంగా స్పందించకపోవటమే కాదు.. దాల్మియా తరఫు వాదనలో పస లేదంటూ కొట్టేశారు. తాజాగా చోటు చేసుకున్న పరిణామంతో ఈడీ ముందు దాల్మియా అండ్ కో కోర్టు ముందుకు హాజరు కావాల్సి ఉంది. రాజకీయ నేతగానే కాదు.. లాయర్ గానూ చిదంబరం తంబి ప్రభావాన్ని చూపించలేకపోతున్నారే..?