Begin typing your search above and press return to search.

చిదంబరానికి బెయిల్ ఇల్లే.. అప్పుడేనా!

By:  Tupaki Desk   |   26 Aug 2019 7:42 AM GMT
చిదంబరానికి బెయిల్ ఇల్లే.. అప్పుడేనా!
X
గతంలో సీబీఐ - ఈడీలను ఉపయోగించుకుని తమ రాజకీయ ప్రత్యర్థులను జైలుకు పంపించిందనే ఘన కీర్తి కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఆ కీర్తిలో ప్రధాన వాటా దారు శ్రీమాన్ చిదంబరం గారే. కాంగ్రెస్ పార్టీకి అణిగిమణిగి ఉండని వారిని ఏదో రకంగా జైళ్లకు పంపడంలో చిదంబరం పాత్ర ప్రముఖమైనది అంటారు. ఇప్పుడు ఆయనే జైలు పాలైన సంగతి తెలిసిందే. అయితే అలా జైలుకు వెళ్లగానే ఆయన తెగ ఆందోళనకు గురి అవుతున్నారు. తనకు బెయిల్ కావాలంటూ అప్పుడే సుప్రీం కోర్టు వరకూ వెళ్లారు.

ఐదు రోజుల పాటు జైల్లో ఉన్న చిదంబరం బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారు. ఢిల్లీ హై కోర్టు ను దాటి సుప్రీం వరకూ వెళ్లారాయన. తన స్వేచ్ఛను హరిస్తున్నారని - తనకు బెయిల్ కేటాయించాలని ఆయన కోరగా అందుకు సుప్రీం నో చెప్పింది. బెయిల్ ను నిరాకరించింది.

అయితే ఉన్నంతలో కొంత ఊరటను ఇచ్చింది. తాము బెయిల్ ను నిరాకరించిన సుప్రీం కోర్టు కావాలనుకుంటే ఈ విషయంలో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు అని పేర్కొంది. ఢిల్లీ హై కోర్టు ఉత్తర్వుల్లో మాత్రం తాము తలదూర్చమని పేర్కొంది. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉన్నా సీబీఐ నిబంధనలను అతిక్రమించింది చిదంబరాన్ని అరెస్టు చేసిందని ఆయన తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ పేర్కొన్నారు. అయితే ఈ వాదనతో కోర్టు ఏకీభవించలేదు.

అయినా తమ రాజకీయ ప్రత్యర్థులను నెలలు - సంవత్సరాల పాటు జైల్లో పెట్టారు కాంగ్రెస్ వాళ్లు. పెద్దగా కారణాలు లేకుండా బెయిల్ రాకుండా సీబీఐ - ఈడీల ద్వారా రచ్చలు చేశారు. ఇప్పుడు తమ వరకూ వచ్చే సరికి రోజుల వ్యవధికే తట్టుకోలేకపోతున్నట్టున్నారు.