Begin typing your search above and press return to search.

చిదంబరం మాష్టారు చెప్పిన లెక్కలు ఎలా మిస్ అయ్యారు కేసీఆర్?

By:  Tupaki Desk   |   9 Feb 2020 6:10 AM GMT
చిదంబరం మాష్టారు చెప్పిన లెక్కలు ఎలా మిస్ అయ్యారు కేసీఆర్?
X
మిగిలిన సంగతులు ఎలా ఉన్నా? తెలంగాణకు ఏ రీతిలో నష్టం వాటిల్లినట్లుగా తెలిసినా చెలరేగిపోవటం.. నష్టం వాటిల్లే వారిపై నిప్పులు చెరుగుతూ ఉంటారు. తెలంగాణకు జరుగుతున్న నష్టాన్ని ఏకరువు పెడుతుంటారు. ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తుంటారు. అలాంటి కేసీఆర్ కామ్ గా ఉన్న వేళ.. మాజీ కేంద్రమంత్రి చిదంబరం మాష్టారు సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేంద్రం పన్నుల పంపిణీలో రాష్ట్రాలు నష్టపోతున్నట్లుగా పేర్కొన్నారు. దేశంలోని రాష్ట్రాలకు రూ.8.5 లక్షల కోట్లను కేంద్రం పంచాల్సి ఉంటే.. కేవలం రూ.6.5 లక్షల కోట్లు మాత్రమే పంచారన్నారు. ఈ లెక్కన చూసినప్పుడు తెలంగాణకు పన్నుల వాటాలోరూ.5వేల కోట్లు నష్టపో్యినట్లు చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకసారి ప్రధాని మోడీకి అనుకూలంగా ఒకసారి.. విమర్శిస్తూ మరోసారి మాట్లాడుతుంటారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి కేసీఆర్ ఎందుకని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయరని ప్రశ్నించారు.

తాను హైదరాబాద్ రోడ్ల వెంట వెళుతున్నప్పుడు.. బ్రాండెడ్ కంపెనీల షోరూమ్స్ చూశానని.. వినియోగదారులు లేక ఖాళీగా కనిపించాయన్నారు. ఇలాంటి పరిస్థితి హైదరాబాద్ లోనే కాదు.. చెన్నైలోనూ ఇలాంటి పరిస్థితి ఉందన్నారు. కొనుగోళ్లు చేసే వారుతగ్గిపోయారని.. ప్రజల చేతిలో డబ్బులు లేకుండా పోయిందన్నారు.

ఆటోమొబైల్ ఇండస్ట్రీ బాగుంటేదేశ ఆర్థిక పరిస్థితి పరిపుష్టిగా ఉంటుందన్న ఆయన.. ఇప్పుడు వారంలో నాలుగురోజులే పని చేస్తుందన్నారు. ఇప్పటివరకూ తెలంగాణకు జరిగే అన్యాయాల్ని ఎప్పటికప్పుడు తన మాటలతో హెచ్చరించే కేసీఆర్.. ఇప్పుడు మౌనంగా ఉండటం ఏమిటి? చిదంబరం మాష్టారి నోటి నుంచి మేలుకొలుపు మాటలు రావటం ఏమిటి కేసీఆర్? లెక్కలు తేడా కొడుతున్నట్లుగా లేవు?