Begin typing your search above and press return to search.
ఎయిమ్స్ కూడా కనికరించలేదు..చిద్దూకు నో బెయిల్
By: Tupaki Desk | 1 Nov 2019 2:51 PM GMTకాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత - కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరానికి కష్టాలు ఇప్పుడప్పుడే సమసేలా కనిపించడం లేదు. అవినీతి కేసులో తీహార్ జైల్లోకి వెళ్లిన చిద్దూ.. బెయిల్ కోసం పట్టు వదలని విక్రమార్కుడికి మల్లే తనవంతు యత్నాలు చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. ఇప్పటికే పలుమార్లు చిద్దూ బెయిల్ పిటిషన్లను కోర్టులు కొట్టేయగా... తాజాగా తన అనారోగ్యాన్ని కారణంగా చూపి బెయల్ దక్కించుకోవాలని చూసిన చిద్దూకు ఈసారి కూడా కోర్టులో పరాభవమే ఎదురైంది. మొన్నటిదాకా చిద్దూ బెయిల్ విన్నపాలను దర్యాప్తు సంస్థలు వీగిపోయేలా చేస్తే... ఇప్పుడు మాత్రం దేశంలోనూ అత్యున్నత వైద్య ప్రమాణాల సంస్థ అఖిల భారత వైద్య విజ్ఝాన సంస్థ (ఎయిమ్స్) చిద్దూకు షాకిచ్చింది.
తనకు ఆరోగ్యం బాగాలేదని - జైల్లోని అపరిశుభ్ర పరిస్థితుల కారణంగా తాను అనారోగ్యానికి గురయ్యానని - సదరు అనారోగ్యం నుంచి తాను బయటపడాలంటే... తనకు బెయిల్ ఒక్కటే మార్గమని చిద్దూ భాయ్ ఢిల్లీ హైకోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ ను పరిశీలించిన కోర్టు... అసలు చిద్దూ ఎలాంటి అనారోగ్యంతో బాధపడుతున్నారు? అసలు ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమిటి? జైల్లో ఉంటే చిద్దూకు రోగాలు ఇంకా తిరగబెడతాయా? అన్న అన్ని విషయాలపై సమగ్రంగా నివేదిక ఇవ్వాలంటూ... ఎయిమ్స్ కు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన ఎయిమ్స్ వైద్య బృందం చిద్దూకు పూర్తి స్థాయి వైద్య పరీక్షలు చేసింది. తమ పరిశీలనలో వెల్లడైన వివరాలను పొందుపరిచిన ఎయిమ్స్ వైద్యులు కోర్టుకు నివేదికను అందజేశారు. చిద్దూ భాయ్ ఆరోగ్యం ప్రస్తుతం సంతృప్తికరంగానే ఉందని సదరు నివేదికలో ఎయిమ్స్ తన నివేదికలో స్పష్టం చేసింది.
ఈ నివేదికను పరిశీలించిన కోర్టు.. చిదంబరానికి ఇప్పటికిప్పుడు బెయిల్ మంజూరు చేయాల్సిన అవసరమేమీ లేదని తేల్చేసింది. అంతేకాకుండా... అనారోగ్య కారణాలతో బెయిల్ ఇవ్వాలన్న చిద్దూ పిటిషన్ లో ప్రస్తావించిన అంశాలన్నీ చిన్న చిన్నవేనని - వాటిని జైలు అధికారులు సరిదిద్దుతారని కూడా కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆరోగ్య పరంగా క్షేమంగానే ఉన్న చిద్దూకు... అనారోగ్య కారణాలతో బెయిల్ ఇవ్వలేమని ఢిల్లీ హైకోర్టు తేల్చి పారేసింది. చిదంబరానికి మినరల్ వాటర్ తో పాటు ఇంటి ఆహారాన్నే సమకూర్చాలని కోర్టుకు మెడికల్ బోర్డు సూచించింది. ఈ నివేదిక ఆధారంగా చిదంబరానికి సురక్షిత పరిసరాలు ఉండేలా చూడటంతో పాటు దోమల నుంచి రక్షణ కల్పించాలని తీహార్ జైలు అధికారులను ఆదేశించింది. సో... ఇంటి భోజనంతో పాటు పరిశుభ్రమైన పరిసరాలను జైల్లోనే అందుకునే చిద్దూ భాయ్ ఇప్పుడప్పుడే బయటకు వచ్చేలా కనిపించడం లేదన్న మాట.