Begin typing your search above and press return to search.

ఆ మాజీ మంత్రి ప్ర‌తిప‌క్ష ర‌థ‌సార‌థి

By:  Tupaki Desk   |   29 Jan 2017 7:14 AM GMT
ఆ మాజీ మంత్రి ప్ర‌తిప‌క్ష ర‌థ‌సార‌థి
X
తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష అయిన స్వ‌రాష్ట్రం ఇచ్చిన‌ప్ప‌టికీ 2014 సార్వత్రిక ఎన్నిక‌లు మొద‌లుకొని అనంత‌రం జ‌రిగిన ప్ర‌తి ఎన్నిక‌ల్లోనూ ఘోర ప‌రాజ‌యం పాలవుతున్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జ‌వ‌స‌త్వాలు కూడ‌గ‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. పార్టీకి పున‌రుజ్జీవం క‌ల్పించేందుకు త్వ‌ర‌లో కొత్త ఇంచార్జీని ప్ర‌క‌టిస్తార‌ని స‌మాచారం. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్య‌వ‌హారాల బాధ్యుడిగా రానున్నార‌ని చెప్తున్నారు. ఇందుకు తాజా ఉదాహ‌ర‌ణ కూడా బ‌లం చేకూరుస్తోంది. తాజాగా హైద‌రాబాద్‌ లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి చిదంబ‌రం ముఖ్య అతిథిగా హాజరు కానుండ‌టంతో ఈ అభిప్రాయాల‌కు బ‌లం చేకూరుతోంది.

ప్ర‌స్తుత ఇంచార్జీ దిగ్విజ‌య్ సింగ్ కు ఆ బాధ్య‌త‌ల‌పై ఆస‌క్తి లేక‌పోవ‌డంతో పాటుగా కాంగ్రెస్ సైతం ఆయ‌న ప‌నితీరుపై అసంతృప్తితో ఉంద‌ని అంటున్నారు. అయితే డిగ్గీరాజాను త‌ప్పిస్తే ఎవ‌రిని నియ‌మించాల‌నే క్ర‌మంలో రెండు పేర్లు తెర‌మీద‌కు వ‌చ్చాయి. గ‌తంలో ఇంచార్జీ బాధ్య‌త‌లు నిర్వ‌హించిన గులాంన‌బీ ఆజాద్ తో పాటు కేర‌ళ మాజీ సీఎం ఉమెన్ చాందీ పేర్లు వినిపించాయి. అయితే గులాం న‌బీ ఆజాద్ ఇంచార్జీగా ఉంటే ఒక వ‌ర్గం వారికే ప్రాధాన్యత ఇస్తార‌ని గ‌తంలో ఈ విధంగా కొంద‌రిని అనూహ్య రీతిలో పైకి తీసుకువెళ్లార‌ని ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు అభ్యంత‌రం తెలిపారు. దీంతో దాదాపు కొలిక్కి వచ్చిన ఆయ‌న ఎంపిక చివ‌రి నిమిషంలో వెన‌క్కు పోయింది. ఇక ఉమెన్ చాందీని అనుకున్న‌ప్ప‌టికీ ఆయ‌నపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల వ‌ల్ల ఆగిపోయింది. కేర‌ళ సీఎంగా ఉన్న స‌మ‌యంలో అవినీతి కుంభ‌కోణాల్లో కూరుకుపోవ‌డం, ఓ మ‌హిళ‌ను వేధించిన ఆరోప‌ణ‌లు ర‌చ్చ‌రచ్చ‌గా మారిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఆయ‌న్ను ఇంచార్జీగా చేస్తే పార్టీ బ‌లోపేతం కంటే విమ‌ర్శ‌కుల‌కు అవ‌కాశం ఇచ్చిన‌ట్లు అవుతుంద‌ని వెన‌క్కి త‌గ్గింది. తాజాగా పొరుగు రాష్ట్రమైన చిదంబ‌రంను ఈ బాధ్య‌త‌ల‌ను ఎంపిక చేశార‌ని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్ర‌క్రియ‌లో కీల‌క పాత్ర పోషించిన గ్రూప్ ఆఫ్ మినిస్ట‌ర్స్‌(జీఓఎం) బృందంలో ఒక‌రిగా ఉండటం వ‌ల్ల రాష్ట్రంలోని రాజకీయ నేత‌ల బ‌లాబలాలు చిదంబ‌రానికి తెలుస‌ని ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెప్తున్నారు. అంతేకాకుండా టీఆర్ఎస్ అధినేత‌, ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాజ‌కీయ వ్యూహాల గురించి సైతం చిదంబ‌రానికి అవ‌గాహ‌న ఉంద‌ని విశ్లేషిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న‌కు ఇంచార్జీ బాధ్య‌త‌లు అప్ప‌గించనున్నార‌నేది కాంగ్రెస్ వ‌ర్గాల టాక్‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/