Begin typing your search above and press return to search.
సౌత్ లో రాహుల్ కోసం సూసైడ్ చేసుకుంటారట!
By: Tupaki Desk | 27 May 2019 8:13 AM GMTమనుషుల్ని బురడీ కొట్టించటానికి మాటలకు మించిన ఆయుధం మరేమీ ఉండదు. అలాంటి మాటలే కాంగ్రెస్ పార్టీని ఎలా ముంచేస్తుందో చెప్పే లేటెస్ట్ ఎగ్జాంఫుల్ గా ఈ ఉదంతాన్ని చెప్పొచ్చు. కాంగ్రెస్ ను ఎవరో ఓడించాల్సిన అవసరం ఉండదని.. ఆ పార్టీ నేతలే ముంచేస్తుంటారన్న విమర్శ ఉంది. రాష్ట్రస్థాయిలో వినిపించే ఈ నానుడి.. ఇప్పుడు జాతీయస్థాయిలోనూ ఇలాంటి పరిస్థితే ఉందని చెబుతున్నారు.
తాజాగా ముగిసిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దారుణ ఓటమి నేపథ్యంలో ఆ అంశంపై పోస్ట్ మార్టం పెద్ద ఎత్తున జరుగుతోంది. తాజా ఫలితంపై ఆగ్రహంతో ఉన్న రాహుల్.. పార్టీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగేందుకు సిద్ధమవుతున్నారు. అయితే.. ఇదొట్టి మాటలే కాదని.. తాను పదవిని ఉంచుకోవటానికి సిద్ధంగా లేనన్న మాట ఆయన ఇప్పటికే స్పష్టం చేస్తున్నారు.
పార్టీ ఓటమితో పాటు.. తాను వ్యక్తిగతంగా అమేథీలో ఓడిపోవటాన్ని రాహుల్ సీరియస్ గా తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా జరిగిన పార్టీ సమావేశంలో సీనియర్ నేత.. మాజీ కేంద్రమంత్రి చిదంబరం మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తే దక్షిణాదిన పార్టీ కార్యకర్తలు ఆత్మహత్యలు చేసుకుంటారన్న మాటను ఆయన చెప్పినట్లుగా చెబుతున్నారు.
ఈ తరహా మాటలే పార్టీని ఇంతకాలం ముంచాయని.. ఇంత మునిగిన తర్వాత కూడా నేతల్లో మార్పు రాకపోవటం ఏమిటని మండిపడుతున్నారు. పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేస్తే.. దక్షిణాదిన ప్రాణాలు తీసుకునే వారు ఉంటారా? అన్న విషయంపై అందరకి క్లారిటీ ఉంది కానీ.. రాహుల్ దగ్గర మాత్రం చిదంబరం మాష్టారి లాంటోళ్లు ఇలాంటివి వినిపించటమా అనిపించక మానదు.