Begin typing your search above and press return to search.
చిదంబరం తొలి జైలు రాత్రి ఎలా గడిచిందంటే?
By: Tupaki Desk | 6 Sep 2019 6:32 AM GMTదేశానికి ఆర్థికమంత్రిగా చేసిన పెద్దమనిషి చిదంబరం.. కానీ అధికారం అడ్డం పెట్టుకొని అవకతవకలకు పాల్పడితే ఎంతటి పెద్దమనిషి అయినా చట్టం ముందు సమానమే కదా.... పాపం చిదంబరం కూడా ఇప్పుడు ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఇరుక్కుపోయాడు. విదేశాల్లోని తన బోగస్ కంపెనీలకు లంచాలుగా తరలించిన సొమ్ము వెలుగులోకి రావడంతో ఐఎన్ఎక్స్ మీడియా - ఎయిర్ సెల్ -మాక్సిస్ కేసుల్లో సీబీఐ అభియోగాలు మోపి ఆయనను తాజాగా సీబీఐ ప్రధాన కార్యాలయంలో రిమాండ్ కు తీసుకొని విచారించింది. ఇప్పుడు కస్టడీ ముగియడంతో తీహార్ జైలుకు తరలించారు.
చిదంబరంను గురువారం రాత్రి తీహార్ జైలులో వేశారు. ఆయనకు ఏడోనంబర్ కారాగారాన్ని కేటాయించారు. అందులోని ఐదో నంబర్ సెల్ లో ఈయనను ఉంచారు. చిదంబరం తొలి జైలు రాత్రి భారంగా గడిచింది. కరుడుగట్టిన నేరస్థుల మధ్య చిదంబరం తీవ్ర ఆందోళనకు గురైనట్టు కనిపించారని జైలు వర్గాలు తెలిపాయి. గురువారం రాత్రంతా ఆయన కంటి మీద కునుకు లేకుండా గడిపినట్టు సమాచారం. తెల్లవారుజామున 4 గంటల సమయంలో చిదంబరం కొద్దిసేపు పడుకున్నట్టు జైలు సిబ్బంది తెలిపారు.
ఇక రాత్రి భోజనాన్ని చిదంబరం తినలేదట.. కొన్ని ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకున్నట్టు తెలిసింది. చిదంబరం 60 ఏళ్లు దాటడంతో ఆయనకు మంచం, ఆరు దుప్పట్లను అందజేశారు. టేబుల్ ఫ్యాన్ తోపాటు చిదంబరం కోరిన వెస్టర్న్ స్టైల్ టాయిలెట్ సౌకర్యాన్ని అధికారులు కల్పించారట..
చిదంబరం ఉన్న ఏడో నంబర్ బ్యారెక్ లో ఎంతో మంది ప్రముఖులు - ఉగ్రవాదులు ఉండడం విశేషం. కశ్మీర్ వేర్పాటు వాద నాయకుడు యాసిన్ మాలిక్ ఇదే బ్యారెక్ లో ఉన్నాడు. ఇక చిదంబరం కొడుకు కార్తి చిదంబరం - మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ మేనల్లుడు రతుల్పూరి - అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలీక్యాప్టర్ కుంభకోణంలో ఇరుక్కున్న ప్రముఖులు జేమ్స్, దీపక్ తల్వార్ లు ఇదే బ్యారెక్ లో జైలులో గడపడం విశేషం.
చిదంబరం ఆర్థికమంత్రిగా చేసిన వారు కావడంతో ఆయన భద్రత దృష్ట్యా ముగ్గురు ఉండాల్సిన 7వ నంబర్ బ్యారెక్ లో కేవలం ఆయనను ఒక్కరినే జైలు అధికారులు ఉంచారు. చిదంబరం ఈనెల 19వరకు పోలీసులు కస్టడీలో తీసుకోవాలని హైకోర్టు సూచించింది. విచారణ సందర్భంగా తీహార్ జైలులో ఉంచాలని ఆదేశించడంతో చిదంబరం జైలులో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.