Begin typing your search above and press return to search.

భారత ప్రధాన న్యాయమూర్తి కంట కన్నీరు

By:  Tupaki Desk   |   24 April 2016 3:35 PM IST
భారత ప్రధాన న్యాయమూర్తి కంట కన్నీరు
X
భారత ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్‌ కంటతడి పెట్టారు. ఢిల్లీలోని విజ్ఞాన భవన్‌ లో జరుగుతున్న ముఖ్యమంత్రులు - హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో మాట్లాడుతుండగా ఆయన ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. న్యాయవ్యవస్థలోని లోపాలపై మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఆయన కంటతడి పెట్టారు.

దేశంలో న్యాయమూర్తుల కొరతతో లక్షల కేసులు పెండింగ్‌ లో ఉన్నాయని అన్నారు. 10 లక్షల జనాభాకు కేవలం 15 మంది జడ్జీలు మాత్రమే ఉన్నారని, దీంతో బాధితులకు సత్వర న్యాయం జరగడం లేదని ఆయన ఆవేదన చెందారు. అమెరికా - బ్రిటన్ - ఆస్ర్టేలియా వంటి దేశాలతో పోల్చితే మన దగ్గర జనాభా - జడ్జిల నిష్పత్తి చాలా దారుణంగా ఉందంటూ ఆయన బాధపడ్డారు. 1987లో లా కమిషన్‌ సిఫార్సులను ప్రభుత్వం వెంటనే అమలుచేయాలని కోరారు. దేశ వ్యాప్తంగా 40 వేల మంది న్యాయమూర్తులను నియమించాల్సిన అవసరం ఉందన్నారు.

మంచు చరియల్లా పేరుకుపోతున్న కేసులకు పరిష్కారం లభించాలంటే జడ్జిల సంఖ్య పెరగాలని.. అప్పుడు బాధితులకు న్యాయం జరుగుతుందని సీజేఐ అభిప్రాయపడ్డారు. వ్యవస్థలో ఉంటూ ఏమీ చేయలేకపోతున్నందుకు ఆయన తీవ్రంగా ఆవేదన చెందారు.