Begin typing your search above and press return to search.
ఆ మంత్రి కష్టం చూడలేకపోతున్నా.... జగన్ మంచి మార్కులే వేశారా...!
By: Tupaki Desk | 18 Nov 2022 11:30 PM GMTఅవును.. ఇప్పుడు వైసీపీలో ఈ మాటే వినిపిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ మంత్రి.. కీలక పొజిషన్‌లో ఉన్నారు. అయితే.. ఆమె కష్టం మాత్రంఅంతా ఇంతా కాదని అంటున్నారు వైసీపీనాయకులు.
పగలంతా.. మంత్రి వర్గంలో ఉన్న పనులు.. సీఎంతో నిర్వహించే సమీక్షలకు హాజరవుతున్నారు. దీంతో సాయంత్రం ఏడు అయిపోతోంది.ఇక, అందరూ ఇళ్లకు వెళ్లి రెస్ట్ తీసుకుంటుంటే.. ఆ మంత్రి మాత్రం ప్రజల ఇళ్లకు వెళ్తున్నారట.
ఆ మంత్రే తానేటి వనిత. ఉదయంనుంచి సాయంత్రం వరకు తన పేషీలో ఉంటున్న ఆమె.. తర్వాత.. తన సొంత నియోజకవర్గం కొవ్వూరులో ఇంటింటికీ తిరుగుతున్నారు. రాత్రి వేళ సెల్ ఫోన్ల వెలుగుల్లోనే ఆమె ప్రజల మధ్యకు వస్తుండడం ఆసక్తిగా మారింది.
అంతేకాదు.. ప్రజలకు ప్రభుత్వ పథకాలపైనా వివరిస్తున్నా రు. ఈ క్రమంలో ప్రజల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తుండడం గమనార్హం. మహిళలు ముఖ్యంగా మంత్రిని సాదరంగా స్వాగతించి.. ఆమె చెప్పింది వింటున్నారట.
ప్రస్తుతం ఈ చర్చ సీఎం పేషీ వరకు వెళ్లిందని అంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ కూడా మంత్రి వనితను మెచ్చుకున్నారని.. వచ్చే ఎన్నికల లోపు ఒక్కొక్క ఇంటినీ.. కనీసం మూడు సార్లయినా.. పరిశీలించి.. లబ్ధిదారులతో మాట్లాడాలని.. ఆయన సూచించారు. ఇదిలావుంటే.. మంత్రి పర్యటనలు బాగానే ఉన్నా.. ఈ పర్యటనలకు పెద్దగా పార్టీ నాయకులు ఎవరూ రావడం లేదు.
మరికొందరు.. వేచి చూసి వెళ్లిపోతున్నారట. దీంతో మంత్రి వనిత.. కేవలం ప్రొటోకాల్ నిబంధనల మధ్యే తన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏదేమైనా.. ఇతరులకన్నా భిన్నంగా ప్రజల మద్య ఉంటున్న వనితకు జగన్ దగ్గర మంచిమార్కులే పడడం గమనార్హం. మరి వచ్చే ఎన్నికల్లోగెలుస్తారా? లేదా? అనేది తేలాల్సి ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.