Begin typing your search above and press return to search.
విశాఖకు జగన్...మ్యాటరేంటంటే...?
By: Tupaki Desk | 18 April 2022 9:39 AM GMTముఖ్యమంత్రి జగన్ కి విశాఖ ఇష్టమైన నగరం అని అంటారు. ఆయన కూడా పదే పదే అది చెప్పుకున్నారు. విశాఖను పరిపాలనా రాజధానిగా చేద్దామని జగన్ అనుకున్నా అది కుదరలేదు. ఆ విషయం ఇలా ఉంచితే నెల రోజుల క్రితం విశాఖ వచ్చి శ్రీ శారదాపీఠంలో జరిగిన ఆధ్యాత్మిక పీఠం కార్యక్రమాల్లో పాల్గొని వెళ్లారు.
ఇపుడు మళ్లీ జగన్ విశాఖ వస్తున్నారు. ఈ నెల 19న విశాఖ పర్యటన ఖరారు అయింది. ఈ టూర్ లో భాగంగా జగన్ విశాఖలో ఇప్పటికే విడిది చేసి ఉన్న హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో భేటీ అవుతారు అని తెలుస్తోంది. ఆయన బీజేపీకి చెందిన ముఖ్యమంత్రి. ఇటీవలే ఆయన విశాఖ వచ్చారు.
విశాఖ సాగరతీరంలోని రుషికొండ వద్ద ప్రేమ వెల్ నెస్ సెంటర్ లో ఆయన ఉంటున్నారు. అక్కడ చికిత్స తీసుకుంటున్నారు అని చెబుతున్నారు.
మరి జగన్ విశాఖ టూర్ ని అర్జంటుగా పెట్టుకోవడం, మనోహర్ లాల్ ఖట్టర్ తో సమావేశం అవుతారు అన్న దాని మీద చర్చ అయితే సాగుతోంది. ఆయనేమో బీజేపీ ముఖ్యమంత్రి. ఈయనేమో వైసీపీ సీఎం.
మరి ఈ ఇద్దరు ఏ అంశాల మీద చర్చిస్తారు అన్నది ఎవరికీ తెలియదు. మర్యాదపూర్వకమైన భేటీ అనుకున్నా జగన్ విశాఖలో వేరే ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడంలేదు. కేవలం బీజేపీ సీఎం కోసేమే వస్తున్నారు అని తెలుస్తోంది.
ఏది ఏమైనా ఈ భేటీ మాత్రం రాజకీయంగా ఆసక్తిని రేపేదే అవుతుందా అంటే చూడాలి మరి. మొత్తానికి జగన్ విశాఖ వస్తూండడంతో వైసీపీ నేతలు ఆయనను కలవడానికి రెడీ అవుతున్నారు. కొత్త జిల్లాగా విశాఖ ఏర్పడ్డాక సీఎం రావడం ఇదే ఫస్ట్ టైమ్.