Begin typing your search above and press return to search.
విభజన అంటే కేసీయార్ దృష్టిలో నీచరాజకీయమా ?
By: Tupaki Desk | 18 Aug 2022 5:30 PM GMT'నీచ రాజకీయం కోసమే విభజన ప్రయత్నాలు జరుగుతున్నాయి'.. కులం, మతం, నీచ రాజకీయం కోసం దేశాన్ని విడదీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేసీఆర్ చెప్పారు. దేశ విభజన కోసం కులం, మతం పేరుతో నీచ రాజకీయాలు జరుగుతున్నాయని కేసీయార్ చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. కేసీయార్ చెప్పిందే నిజమైతే మరి సమైక్య ఆంధ్రప్రదేశ్ విభజన కోసం తాను చేసిందేమిటి ? అనే ప్రశ్నకు ముందు సమాధానం చెప్పాలి.
సమైక్య రాష్ట్రాన్ని విడదీసి ప్రత్యేక తెలంగాణా కావాలని డిమాండ్ చేసినపుడు కేసీఆర్ అండ్ కో చెప్పిన కారణాలు ఏమిటి ? సీమాంధ్రులు తెలంగాణాను అవమానిస్తున్నారన్నారు. నిధుల కేటాయింపు, నీటి వనరుల కేటాయింపు, ఉద్యోగాల భర్తీ లాంటి అనేక అంశాలతో పాటు అభివృద్ధి పైన కూడా పాలకులు తెలంగాణాపై వివక్ష చూపిస్తున్నట్లు కొన్ని వేలసార్లు కేసీయార్ ఆరోపణలు చేసుంటారు. ఇవన్నీ రాజకీయంగా చేసిన ఆరోపణలే కానీ వాస్తవాలు కావని తర్వాత రుజువైంది.
ప్రత్యేక తెలంగాణా వాదన నేపథ్యంలో కేంద్రప్రభుత్వం అధ్యయనం కోసం శ్రీకృష్ణ కమిటీని నియమించింది. ఆ కమిటీ ప్రత్యేక తెలంగాణా డిమాండ్ లన్నింటినీ దృష్టిలో పెట్టుకుని చరిత్రనంతా తవ్వితీసింది. అప్పట్లో మొత్తం 23 జిల్లాల్లోను పర్యటించి అనేకరంగాల్లోని ప్రముఖులతో మాట్లాడి, అందుబాటులో ఉన్న రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించింది.
దాదాపు ఆరు నెలల పాటు అధ్యయనం చేసి ఒక రిపోర్టును కేంద్రానికి అందించింది. ఆ రిపోర్టు ప్రకారం ప్రత్యేక తెలంగాణా వాదనల కోసం వినిపిస్తున్న వాదనంతా తప్పేనని తేల్చేసింది.
అభివృద్ధిలో సీమాంధ్ర కన్నా తెలంగాణాయే ముందున్నదని ఉదాహరణలతో సహా చెప్పింది. ప్రతిరంగంలోను సీమాంధ్ర కన్నా తెలంగాణా ఏ విధంగా మెరుగ్గా ఉందనే విషయాన్ని వివరించి చెప్పింది.
అయితే కమిటీ నివేదికపై కేసీయార్ అండ్ కోకి ఏమాట్లాలో తెలీక అప్పటికప్పుడు ఆత్మగౌరవమనే నినాదాన్ని తెరపైకి తెచ్చారు. సరే ఏదో పద్దతిలో చివరకు రాష్ట్ర విభజన జరిగిపోయింది. ఇంతకాలానికి దేశవిభజన పేరుతో నీచరాజకీయాలు జరుగుతున్నాయని కేసీయార్ ఆరోపించటమే విచిత్రంగా ఉంది. అయినా దేశవిభజనకు ఎవరు డిమాండ్లు చేశారు ? ఎప్పుడు డిమాండ్ చేశారో తెలీటం లేదు.