Begin typing your search above and press return to search.

కేసీఆర్ పెద్ద‌ప‌ల్లి ప‌ర్య‌ట‌న‌.. ఆ మంత్రికి ప‌రీక్షేనా!

By:  Tupaki Desk   |   29 Aug 2022 5:05 AM GMT
కేసీఆర్ పెద్ద‌ప‌ల్లి ప‌ర్య‌ట‌న‌.. ఆ మంత్రికి ప‌రీక్షేనా!
X
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప‌ర్య‌ట‌న ఇప్ప‌టి వ‌ర‌కు అధికారుల‌కు ప‌రీక్ష పెట్ట‌గా.. ఇప్పుడు.. ఏకం గా.. కీల‌క‌మైన మంత్రికే ప‌రీక్ష కానుంద‌ని చెబుతున్నారు. కేసీఆర్‌.. సోమ‌వారం.. పెద్దపల్లి జిల్లాలో పర్యటించ నున్నారు.

హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన కరీంనగర్ బైపాస్ రోడ్డు మీదుగా భారీ ర్యాలీతో మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చేరుకోనున్నారు. అయితే.. ఇది.. భారీ ప్ర‌ద‌ర్శ‌న‌కు.. బ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌కు.. కూడా వేదికకానుండ‌డం గ‌మ‌నార్హం.

5000 వేల‌కార్ల‌తో..హంగామా!

ఇక‌, కేసీఆర్ కోసం.. శామీర్ పేట నుంచి సిద్దిపేట వరకు దారిపోడువున వందలాది కార్లు ముఖ్యమంత్రి కాన్వాయ్‌లో చేరేలా ఏర్పాట్లు చేశారు. ఆర్థిక మంత్రి హరీశ్ రావుకు కేసీఆర్ ప‌ర్య‌ట‌న ప‌రీక్ష‌గా మారింది. భారీ ఎత్తున జ‌న స‌మీక‌ర‌ణ‌కు.. కూడా ఇత‌ర మ‌త్రులు ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఈ క్ర‌మంలో హ‌రీష్ రావు.. వంద‌లాది కార్లు ఏర్పాటు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో రాజీవ్ రాహదారిపై ప్రధాన కూడళ్ల వద్ద ముఖ్యమంత్రి ఆగే అవకాశం ఉంది. 4000 నుంచి 5000 కార్లతో ఆయ‌న వెంట పార్టీ నాయ‌కులు వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు.

ఈ ప‌ర్య‌ట‌న‌లో కేసీఆర్ చేసేది ఏంటంటే.. ముందుగా రూ.48 కోట్లతో నిర్మించిన సమీకృత (ఇంటిగ్రే టెడ్‌) కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం పెద్దపల్లి శివారులోని పెద్దబొంకూరు వద్ద 21 ఎకరాల సువిశాల విస్తీర్ణ స్థలంలో నిర్మించిన కార్యాలయాల సముదాయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు.

అనంతరం మంథని రోడ్డులో నిర్మించిన‌ టీఆర్ ఎస్‌ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత కలెక్టరేట్ సముదాయం ఎదురుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. బహిరంగ సభ కోసం ప్రత్యేకంగా 130 ఎకరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జనసమీకరణకు మంత్రులు గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. 5000 కార్ల‌తో కాన్వాయ్ ఏర్పాటుకు.. మంత్రి హ‌రీష్ చ‌ర్య‌లు తీసుకున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. Abuse వద్దు.