Begin typing your search above and press return to search.
జగన్ వర్క్ ఫ్రం హోమ్ ముఖ్యమంత్రి
By: Tupaki Desk | 24 Nov 2021 4:30 AM GMTకరోనా కారణంగా వర్క్ ఫ్రం హోమ్ అనే పేరును ఎక్కువగా వింటున్నాం. కానీ ఇప్పుడు ఏపీలో వరదల కారణంగా ముఖ్యమంత్రి జగన్‌ను వర్క్ ఫ్రం హోమ్ సీఎంగా విమర్శిస్తూ జనసేన తీవ్రవ్యాఖ్యలు చేసింది. ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రభుత్వం నుంచి కనీసం పలకరించే దిక్కు లేకుండా పోయిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇల్లు కదలని ముఖ్యమంత్రి అంటే జగనే అని.. ఆయన వర్క్ ఫ్రం హోమ్ సీఎం అని నాదెండ్ల విమర్శించారు. ప్రజలు వరదతో కష్టాలు పడుతుంటే సీఎం మాత్రం గాల్లో హెలికాప్టర్‌లో తిరిగి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు.
అధిక వర్షాల వల్ల కలిగిన వరదల కారణంగా నష్టపోయిన చిత్తూరు, కడప జిల్లాలో పర్యటించేందుకు తిరుపతి చేరుకున్న నాదెండ్ల.. జగన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే.. ఏ మాత్రం పరిపాలన దక్షత లేని నాయకుడిగా జగన్ తయారయ్యారు. ప్రజలు కష్టాలు పడుతుంటే సీఎం మాత్రం ఏరియల్ సర్వే చేసి జిల్లాకు రూ.2 కోట్లు సాయం ప్రకటించడం విడ్డూరంగా ఉంది. బాధ్యత కలిగిన ఓ రాజకీయ పార్టీగా కష్టాల్లో ఉన్నవాళ్లకు అండగా నిలిచేందుకు జనసేన ఎప్పుడూ ముందుంటుంది. అందుకే ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. వరద ప్రభావిత ప్రాంతాల్లో పార్టీ తరపున మెడికల్ క్యాంపుల నిర్వహణ, నిత్యావసర సరుకుల పంపిణీ లాంటి కార్యక్రమాలు చేపట్టాం. ఇప్పుడు తాను వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టంపై అంచనా రూపొందిస్తా. ఆ తర్వాత పవన్ కల్యాణ్ పర్యటిస్తారు. వరద వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకునేంత వరకు జనసేన పోరాటం సాగిస్తోంది అని నాదెండ్ల పేర్కొన్నారు.
మరోవైపు మూడు రాజధానుల బిల్లు విషయంలో జగన్ ప్రభుత్వంపై జనసేనాని పవన్ కల్యాణ్ కూడా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. రాజధానిపై హైకోర్టులో విచారణ సాగుతున్న కేసుల్లో ఓటమి నుంచి తప్పించుకోవడానికే సీఎం జగన్ కొత్త నాటకానికి తెరతీశారని పవన్ అన్నారు. కోర్టు నుంచి తాత్కాలికంగా తప్పించుకోవడానికే వికేంద్రీకరనణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారని ఆయన తప్పుపట్టారు. ఆ బిల్లులను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన సీఎం.. మరోవైపు మరింత స్పష్టతతో కొత్త బిల్లులను ప్రవేశపెడతామని చెప్పడం గందరగోళం సృష్టించిందని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.