Begin typing your search above and press return to search.
కేంద్రం పై ముఖ్యమంత్రుల యుద్ధం!
By: Tupaki Desk | 1 Jun 2021 3:30 PM GMTఅన్ని రాష్ట్రాలను కబళించి ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలని ఓ వైపు బీజేపీ పాగా వేస్తుంటే.. బీజేపీని ఎదుర్కొని నిలబడ్డ సీఎంలు ఇప్పుడు కేంద్రంతో ఫైట్ కు రెడీ అవుతున్నారు. కేరళలో బీజేపీ ఇస్రోమ్యాన్ ను దింపి మరీ అక్కడ ఓడిపోయింది. అయితే గెలిచిన సీఎం విజయన్ ఇప్పుడు కేంద్రంపై పోరుబాటకు శ్రీకారం చుట్టాడు. ఆయనకు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ జతకలిశాడు. బీజేపీయేతర సీఎంలందరినీ కలిసి ఒక్కతాటిపై తెచ్చేందుకు ఇప్పుడు దేశంలో ప్రయత్నాలు సాగుతుండడం హాట్ టాపిక్ గా మారింది.
తాజాగా కరోనా సెకండ్ వేవ్ మొదలైన క్రమంలో కేంద్రప్రభుత్వంతో కొన్ని బీజేపీయేతర పాలక రాష్ట్రాలు యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. దీనికి కేరళ సీఎం పినరయి విజయన్ చొరవ చూపుతున్నారు. ఆయన దేశంలోని 11 మంది బీజేపీయేతర ముఖ్యమంత్రులకు తాజాగా సంచలన లేఖలు రాశారు. కరోనా కాలంలో కొన్ని రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని.. కరోనాను నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేసేలా కేంద్రం మీద ఒత్తిడి తెద్దాం అని.. అందరూ కలిసి రావాలని విజయన్ బీజేపీయేతర సీఎంలకు పిలుపునిచ్చాడు.
వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలు కేంద్రం కొనుగోలు చేస్తే ఒకరేటు.. రాష్ట్రాలు అడిగితే మరో రేటు చెబుతున్నాయని.. ఈ ధరల మధ్య వ్యత్యాసం లేకుండా కేంద్రమే వ్యాక్సిన్లను సేకరించి రాష్ట్రాల సహకారంతో ప్రజలందరికీ ఉచితంగా ఇవ్వాలని విజయన్ తన లేఖలో డిమాండ్ చేశారు.
ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ముందుకు రావాలని కేరళ సీఎం బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు.
ఇక విజయన్ కు తోడుగా జార్ఞండ్ సీఎం హేమంత్ సోరెన్ మరో అడుగు ముందుకేశారు. మీడియా ముందుకొచ్చి మరీ.. వ్యాక్సిన్ పంపిణీలో కేంద్రం విధానాలు రాష్ట్రాలకు ఇబ్బందిగా మారాయని ఆరోపించారు. తమ రాష్ట్రానికి ఉచితంగా కరోనా టీకాలు పంపించాలని ప్రధానిని డిమాండ్ చేశారు. వ్యాక్సిన్ కొనుగోలు తమకు తలకు మించిన భారమవుతోందని వాపోయారు. రాష్ట్రానికి అందుతున్న టీకాలు ఏమాత్రం సరిపోవడం లేదని.. కేటాయింపుల్లో పారదర్శకత పాటించలేదని సోరెన్ ఆరోపించారు. కరోనా వల్ల జార్ఖండ్ ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని.. టీకాలు ఉచితంగా అందజేయాలని సోరెన్ విజ్ఞప్తి చేశారు. కరోనాతో విలవిలలాడుతున్న ఈ సమయంలో టీకాల సేకరణ బాధ్యతను రాష్ట్రాలపైకి నెట్టడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానించారు.