Begin typing your search above and press return to search.
అసెంబ్లీలో సీఎం.. ఆయన భార్య..ఇదే ప్రథమమట..
By: Tupaki Desk | 7 Nov 2018 10:55 AM GMTముందు భర్తలు ప్రజాప్రతినిధి అవుతారు.. ఆ తర్వాత తమ భార్యలను రాజకీయ అరంగేట్రం చేయించడం ఆనవాయితీ. సర్పంచ్ నుంచి సీఎం పోస్టు వరకూ రాజకీయాల్లో ఇది కామన్.. బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ దాణా కుంభకోణంలో జైలుకెళ్లినప్పుడు ఆయన భార్య రబ్రీదేవిని సీఎం సీటు పై కూర్చోబెట్టారు. అయితే లాలూ-రబ్రీ కలిసి అసెంబ్లీలోకి సతీసమేతంగా వెళ్లలేకపోయారు.. ఎంపీలు, ఎమ్మెల్యేలుగా దేశంలో చాలా మంది భార్యభర్తలున్నారు.
ఇక తెలంగాణ, ఏపీలో కూడా కొందరు సతీసమేతంగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ప్రజాప్రతినిధులున్నారు. తెలంగాణలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య పద్మావతిలు తెలంగాణ అసెంబ్లీలో సతీసమేతంగా అడుగుపెట్టారు.
అయితే కర్ణాటక అసెంబ్లీలో అద్భుతం జరగబోతోంది. సీఎం హోదాలో ఉన్న కుమారస్వామి ఇటీవలి ఉప ఎన్నికల్లో తన భార్య అనితా కుమారస్వామిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. సీఎం హోదాలో కుమారస్వామి, ఎమ్మెల్యే హోదాలో అనిత ఒకేసారి అసెంబ్లీకి వెళ్లడం దేశంలోనే ఇదే ప్రథమమట... సతీసమేతంగా అసెంబ్లీకి వెళ్లే ముఖ్యమంత్రి కుమారస్వామి మాత్రమే అని చెబుతున్నారు. ఈ విధంగా అనిత కుమారస్వామి చరిత్ర సృష్టించిందని పరిశీలకులు పేర్కొంటున్నారు.