Begin typing your search above and press return to search.

జయ మరణంతో కన్నీరు కార్చిన ముఖ్యమంత్రులు

By:  Tupaki Desk   |   6 Dec 2016 11:09 AM GMT
జయ మరణంతో కన్నీరు కార్చిన ముఖ్యమంత్రులు
X
జయలలితను కడసారి చూసి నివాళులర్పించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నేతలంతా వచ్చారు. ప్రధాని మోడీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ - మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఐరన్ లేడీకి నివాళులర్పించారు.

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయ‌డు - క‌ర్ణాట‌క సీఎం సిద్ధ‌రామయ్య - ఒడిశా సీఎం నవీన్ పట్నాయిక్ - మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ - ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌ జ‌య‌ల‌లిత‌కు నివాళుల‌ర్పించారు. మిగతా ముఖ్యమంత్రులూ జయ మరణంపై ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయిక్ జయ మరణం కారణంగా తమ శాసనసభ సమావేశాలను ఒక రోజు పాటు వాయిదా వేయించారు. ఆ రాష్ర్ట శాసనసభ జయ మృతికి సంతాపంగా మౌనం పాటించింది. జయ అంత్యక్రియులకు హాజరవుతున్నట్లు నవీన్ శాసనసభలోనే ప్రకటించడం గమనార్హం. పలు రాష్ర్టాల ముఖ్యమంత్రులు జయ మరణవార్త విని కన్నీటి పర్యంతమయ్యారు. కశ్మీర్ సీఎం మహాబూబా ముఫ్తీ జయను దేవతగా అభివర్ణించారు.

మరోవైపు జయతో అనుబంధాన్ని దేశవ్యాప్త ప్రముఖులంతా గుర్తు చేసుకున్నారు. జయలలితతో కలిసి నటించి బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర అయితే కన్నీటి పర్యంతమయ్యారు. ఆమెకు ఆరోగ్యం బాగోలేదని తెలిసిన తర్వాత... త్వరగా ఆమె కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థించానని... ఇంతలోనే ఆమె మరణవార్తను విని, దిగ్భ్రాంతికి గురయ్యానని చెప్పారు. 1968లో 'ఇజ్జత్' సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించారు. ఆనాటి సంగతులను ఆయన ధర్మేంద్ర గుర్తు చేసుకున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/