Begin typing your search above and press return to search.
ఢిల్లీకి వెళ్లి గంటల తరబడి వెయిట్ చేసే తెలుగు సీఎంలు పెద్ద తప్పు చేశారా?
By: Tupaki Desk | 14 Aug 2021 9:30 AM GMTమోడీ సర్కారులో నెంబరు టూ.. ఆయనకు అత్యంత సన్నిహితుడైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా రెండు తెలుగు రాష్ట్రాలకు వచ్చారు. తిరిగి వెళ్లిపోయారు. కేంద్రంలో ఏ పంచాయితీ ఉన్నా.. ప్రధానమంత్రి మోడీని కలవాలన్నా ముందు అమిత్ షాను కలవాలి.. ఆయనకు బ్రీఫింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అంతే తప్పించి.. నేరుగా మోడీని కలిసే అవకాశం ఉండదు. ఒకవేల.. ముందు మోడీ అపాయింట్ మెంట్ ఫిక్స్ అయితే.. భేటీ తర్వాతైనా సరే.. అమిత్ షాను కలిసి విషయాలు షేర్ చేసుకోవటం తరచూ జరుగుతుంటుంది. అంతదాకా ఎందుకు అమిత్ షాను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లి.. ఆయన అపాయింట్ మెంట్ ఫిక్స్ కాకపోతే.. వెయిట్ చేసి మరీ కలిసి వచ్చే అలవాటు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఉన్నదే.
అలాంటి సీఎంలు.. అదే అమిత్ షా తమ రాష్ట్రలకు వచ్చినప్పుడు సాదారంగా స్వాగతం పలకటం.. లేదంటే.. మర్యాదపూర్వకంగా కలవటం పెద్ద విషయమేమీ కాదు. నరసింహన్ గవర్నర్ గా ఉన్న వేళలో.. ఆయన్ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత తరచూ కలుస్తుండేవారో.. ఎన్నేసి గంటలు వారి భేటీ సాగేదో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. అలాంటిది కేంద్రంలో పని జరగాలన్నా.. అక్కడ ఉండే ప్రతి అవసరాన్ని తీర్చేందుకు ఉన్న అమిత్ షా తమ రాష్ట్రాలకు వచ్చినప్పుడు తెలుగు ముఖ్యమంత్రులు వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? అన్నది అసలు ప్రశ్న.
శ్రీశలం మల్లికార్జున స్వామిని దర్శించుకోవటం సతీమణితో పాటు వచ్చిన ఆయన.. అంతకు ముందు ఢిల్లీ నుంచి హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోవటం తెలిసిందే. నిజానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకోవాలే కానీ.. బేగంపేటకు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిస్తే పోయేదేమీ లేదు. కానీ.. అలాంటిదేమీ చేయలేదు. ఆ మాటకు వస్తే.. అమిత్ షా సైం హైదరాబాద్ కు రావాల్సిన అవసరం లేదు. నేరుగా శ్రీశైలం వెళ్లే వీల్లేకున్నా.. విజయవాడకు వెళ్లి అక్కడి నుంచి వెళ్లొచ్చు. లేదంటే.. కర్నూలుకు వెళ్లి అక్కడి నుంచి కూడా వెళ్లొచ్చు.
కానీ.. అలా కాకుండా హైదరాబాద్ కు వచ్చివెళ్లటం ఆసక్తకరమైన అంశంగా చెప్పాలి. ఇక.. తమ రాష్ట్రానికి వచ్చిన మంత్రి అమిత్ షాకు స్వాగతం పలికితే సీఎం జగన్ కు పోయేదేమీ లేదు. చిన్నతనం ఏమీ కాదు. కానీ.. అందుకు భిన్నంగా శ్రీశైలం వచ్చిన అమిత్ షాకు స్వాగతం పలికేందుకు వెళ్లింది ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఒక్కరే. ఆయనతో పాటు స్థానిక ఎంపీ.. స్థానిక ఎమ్మెల్యే తప్పించి మరే అధికారపక్ష నేత లేరు. శ్రీశైలానికి వచ్చి వెళ్లిన అమిత్ షాను కలవటానికి సీఎం జగన్ ఎందుకు ఆసక్తి ప్రదర్శించలేదన్నది ఇప్పుడు చర్చగా మారింది.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో తమకు పెరిగిన దూరం అమిత్ షా తాజా టూర్ తో అర్థమైందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. తమ రాష్ట్రానికి వచ్చిన అమిత్ షాను ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులు కలిసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకు భిన్నంగా పరిణామాలు చోటు చేసుకోవటం చూస్తే. .లెక్కలో ఏదో తేడా వచ్చేసిందన్న అభిప్రాయం కలుగక మానదు.