Begin typing your search above and press return to search.
'అఖండ' పై స్పందించిన చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రథాన అర్చకులు
By: Tupaki Desk | 16 Dec 2021 4:30 PM GMTనందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా వంద కోట్ల వసూళ్లు సాధించి ఘన విజయం సాధించింది. సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ లో నమోదు అయిన అతి పెద్ద విజయంగా ఈ సినిమా నిలిచింది అనడంలో సందేహం లేదు. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా బాలయ్య మరియు బోయపాటిల కాంబోకు హ్యాట్రిక్ ను తెచ్చి పెట్టింది. రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లను సాధించిన అఖండ సినిమా పై ఇండస్ట్రీ వర్గాల వారు మాత్రమే కాకుండా ఇతర వర్గాల వారు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రథాన అర్చకులు ఈ సినిమాపై స్పందించారు.
గత వారం సేవక బృందంతో కలిసి అఖండ సినిమాను చూడటం జరిగింది. ఆ సమయంలోనే సినిమా గురించి స్పందించాలని అనుకున్నాను. కాని ఆ సమయంలో వీలు పడలేదు. అఖండ సినిమా లో ధర్మానికి ఎంత నష్టం జరుగుతుందో ఈ సినిమాలో ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నం చేశారు. ధర్మాన్ని రక్షించుకోవడం కోసం ప్రతి ఒక్కరు ఎంతకైనా తెగించాల్సి ఉంది. ధర్మాన్ని కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి పోరాటం చేయాల్సిన సమయం ఇది. అహింసా ప్రథమో ధర్మః అనే వ్యాఖ్యాన్ని ఎలా దుర్వినియోగ పర్చుతున్నారో ఈ సినిమాలో చూపించడం జరిగింది. ప్రస్తుతం ధర్మంను కాపాడుకోలేక పోతున్నాం అని ప్రతి ఒక్కరి మనసులో ఉంది. అందుకే ఎక్కువ మంది ఈ సినిమాను చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మనసులో ఉక్రోషంతో ఉన్నారు కాని ఏ ఒక్కరు బయటకు చెప్పలేక పోతున్నారు.. ఏం చేయలేక పోతున్నారు అంటూ ప్రథాన అర్చకులు అన్నారు.
రామరాజ్య స్థాపన కోసం ప్రతి ఒక్కరు మనసులో కోరుకుంటున్నారు. కాని చేతిలో ఏమీ లేదు. ఈ సినిమా తీసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ భగవంతుడు మంచి చేయాలని ఆశిస్తున్నాను అన్నాడు. బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ సినిమా గా ఈ సినిమా నిలిచింది. భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా ను ఈ నెల ఆరంభంలో విడుదల చేశారు. ఇంకా కూడా సినిమా భారీగానే వసూళ్లు రాబడుతూ ఉంది. ఓవర్సీస్ లో ఈ సినిమా మిలియన్ మార్క్ ను దక్కించుకుంది. భారీ ఎత్తున అంచనాలున్న అఖండ సినిమా ను ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా అన్ని చోట్ల కూడా ప్రేక్షకులు ఆధరించి వంద కోట్లకు పైగా కట్టబెట్టారు.