Begin typing your search above and press return to search.
విలేకర్లకు విందులు... యజమానులకు తిట్లు!
By: Tupaki Desk | 13 July 2022 7:41 AM GMTతమ కోపం అంతా యాజమాన్యాలపైనే అని, విలేకరులపై కాదని ఓ సందర్భంలో ప్రభుత్వ పెద్ద సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ మాటలకు అనుగుణంగానే నిన్నటి వేళ విజయవాడలో కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి.
లంచ్ మీట్ ఒకటి ఏర్పాటు చేసి మరీ ! వైసీపీ పెద్దలు మీడియా మిత్రులతో భేటీ అయ్యారు. వారి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. తమ సాయం కావాలంటే చెప్పండి వీలున్నంత వరకూ ప్రభుత్వం తరఫున చేస్తామంటూ హామీ ఇచ్చారు. సజ్జల రామకృష్ణారెడ్డి, కురసాల కన్నబాబు లాంటి మాజీ జర్నలిస్టులు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు.
ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్న, పరితపిస్తున్న తమపై దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొంటూ దుష్ట చతుష్టయం పై తీర్మానం చేసింది వైసీపీ. కానీ అంతలోనే మనసు మార్చుకుని నిన్నటి వేళ జర్నలిస్టులకు షడ్రశోపేతం అయిన భోజనం పెట్టింది.
ఖరీదయిన హోటల్లోఈ కార్యక్రమం జరిగింది. ఈ విందుకు ప్రతిరోజూ జగన్ సర్ తో తిట్లు తినే టీడీపీ అనుకూల మీడియా ప్రతినిధులు కూడా వెళ్లారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఎప్పటి నుంచో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయిన నాటి నుంచో లేదా అంతకుముందు నుంచో జర్నలిస్టులకు, సంబంధిత వర్గాలకూ గ్యాప్ ఉంది. దాన్ని ఫిల్ చేసేందుకు ఏనాడూ ఏ ప్రయత్నమూ జరగలేదు. కానీ నిన్నటి వేళ మాత్రం వైసీపీ పెద్దలు సడెన్ గా గేరు మార్చారు.
విజయవాడలో ఓ ప్రముఖ హోటల్ లో అందరినీ పిలిచి మీడియా పెద్దలకు విందు ఇచ్చారు. ఇప్పుడీ వార్త వైరల్ అవుతోంది. ప్లీనరీని సక్సెస్ చేసిన క్రమంలో వైసీపీ జర్నలిస్టులే కాదు మిగిలిన మీడియా కూడా కృషి చేసిందని సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన కృతజ్ఞతగా ఇచ్చిన పార్టీ ఇది అని తెలుస్తోంది. ఈ విందు వినోదాలకు టీడీపీ జర్నలిస్టులు కూడా హాజరయ్యారు అని తెలుస్తోంది.