Begin typing your search above and press return to search.

జవహర్ రెడ్డికి వరం... కొత్త సీఎస్ గా ప్రమోషన్...?

By:  Tupaki Desk   |   25 Nov 2022 12:02 PM GMT
జవహర్ రెడ్డికి వరం... కొత్త సీఎస్ గా ప్రమోషన్...?
X
ఏపీలో కీలకమైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవికి సీఎం ఓ ఆఫీసులో కీలక అధికారిగా ఉన్న జవహర్ రెడ్డికి ఇస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. జవహర్ రెడ్డికి వైసీపీ ప్రభుత్వ పాలనలో మంచి గుర్తిపు లభిస్తోంది. గతంలో ఆయన పెద్దగా ప్రాధాన్యత కలిగిన పోస్టులలో ఉండేవారు కాదంటారు. అయితే వైసీపీ పవర్ లోకి రావడంతో ఆయన దశ తిరిగింది అని చెబుతారు.

ఆయన కరోనా టైం లో మొత్తం ఆరోగ్య శాఖను తన గుప్పిట్లో ఉంచుకుని చక్రం తిప్పారు. ఆయనకు హెల్త్ విభానం అలా అప్పగించారు. ఆ తరువాత ఆయన కోరిక మేరకు కొన్నాళ్ళు టీటీడీపీ చైర్మన్ గా నియమించినా ఇపుడు సీఎం ఓ ఆఫీసులో ఆయనను కీలకంగా చేశారు. ఇక తొందరలో ఖాళీ అవుతున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిలో ఆయనను జగన్ సర్కార్ నియమిస్తోంది అని అంటున్నారు.

ప్రస్తుతం ప్రధాన కర్యదర్శిగా ఉన్న సమీర్ శర్మ పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగుస్తోంది. మరో ఏడాది పాటు ఆయన సేవలు వాడుకోవచ్చు కానీ ఆయన ఇటీవలే గుండె ఆపరేషన్ చేయించుకున్నారు. దాంతో ఆయన రిటైర్మెంట్ కే మొగ్గు చూపుతున్నారుట. ఇలా ఆయన ప్లేస్ లో కొత్త సీఎస్ ని తీసుకోవాలి. ఈ మధ్యలో చాలా పేర్లు వినిపించాయి. సీనియర్ అధికారిణి శ్రీలక్ష్మికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి ఇస్తారని అనుకున్నారు. ఇటీవల గాలి జనార్ధనరెడ్డి కేసుల విషయంలో ఆమెపైన పెట్టిన కేసులను హై కోర్టు కొట్టేసింది.

కానీ జగన్ మీద పెట్టిన అక్రమాస్తుల కేసులు అలాగే ఉన్నాయి. బహుశా ఈ కారణం వల్ల కావచ్చు ఆమెను పక్కన పెట్టి జవహర్ రెడ్డిని ముందుకు తీసుకువచ్చారని అంటున్నారు. ఆయన సర్వీస్ ఇంకా ఎక్కువ కాలం ఉంది. అంతే 2024లో సార్వత్రిక ఎన్నికలు ఆయన సీఎస్ గా ఉండగానే జరుగుతాయని అంటున్నారు. ఆయన పట్ల వైసీపీ పెద్దలు ప్రత్యేక శ్రద్ధతో ఉంటున్నారు.

దాంతో ఎన్నికల వేళకు ఆయనను సీఎస్ గా తెచ్చుకుంటే సానుకూలత ఉంటుంది అని లెక్కలేసుకుని మరీ తెస్తున్నారు అని అంటున్నారు. మరో వైపు చూస్తే కొత్త సీఎస్ గా జవహర్ రెడ్డి నియామకం కనుక జరిగితే మాత్రం వైసీపీ సామాజిక న్యాయం మీద విమర్శలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే డీజీపీగా జగన్ సొంత జిల్లాకు చెందిన వారు అయిన రాజేంద్రనాధ్ రెడ్డి ఉన్నారు. ఇపుడు సీఎస్ గా జవహర్ రెడ్డిని కూడా తీసుకుంటే సామాజిక న్యాయం పూర్తి అవుతుంది అని సెటైరికల్ గా అంటున్నారు.

ముఖ్యమంత్రి సీఎస్, డీజీపీ ఒకే సామాజికవర్గానికి చెందిన వారు ఉండడం అంటే నిజంగా అరుదైన విషయమే అనుకోవాలి. ఏది అయినా అన్ని విషయాలూ అంచనా వేసుకునే జగన్ జవహర్ రెడ్డిని తీసుకోవాలనుకుంటున్నారు అని తెలుస్తోంది. దీని మీద డెసిషన్ తీసుకోవడం పూర్తి అయింది అని ఇక ప్రకటించడమే తరువాయి అని అంటున్నారు. సో కొత్త సీఎస్ గా జవహర్ రెడ్డి అన్న మాట.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.