Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యేల కోనుగోలు కేసు: ఓ వైపు ఈడీ.. మరోవైపు సీబీఐ.. డిఫెన్స్ లో కేసీఆర్..?

By:  Tupaki Desk   |   27 Dec 2022 8:30 AM GMT
ఎమ్మెల్యేల కోనుగోలు కేసు: ఓ వైపు ఈడీ.. మరోవైపు సీబీఐ.. డిఫెన్స్ లో కేసీఆర్..?
X
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కేసీఆర్ కు ఊహించని షాక్ తగిలినట్లు తెలుస్తోంది. తమ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందని సంచలన ఆరోపణలు చేసిన ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ వీడియో ప్రసారం చేయించారు. ఆ తరువాత సిట్ తో దర్యాప్తు చేయించి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేయించారు. అయితే ఈ కేసుపై విచారించేందుకు కేంద్రం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని రంగంలోకి దించిన విషయం తెలిసిందే. ఇటీవల ఈడీ అధికారులు కేసులో భాగమైన ఫైలట్ రోహిత్ రెడ్డికి నోటీసులు పంపారు. ఆ తరువాత ఆయనను విచారించారు. మరోవైపు ఈ కేసులో అరెస్టయిన వారు.. తమపై తప్పుడు ఆరోపణలు చేసి కేసులో ఇరికించారని ఆరోపిస్తూ, ఈ కేసును సీబీఐతో విచారించాలని హైకోర్టును సంప్రదించారు. తాజాగా ఈ కేసును విచారించాలని కోర్టు సీబీఐకి అనుమతి ఇచ్చింది. దీంతో కేసీఆర్ డిఫెన్స్ లో పడ్డట్లు తెలుస్తోంది.

గత నెల రోజుల కిందట ఓ హోటల్ లో ముగ్గురు వ్యక్తులు, నలుగురు ఎమ్మెల్యేలు నిర్వహించిన సమావేశం వీడియో బయటకు వచ్చింది. అయితే ఇందులో తమకు 100 కోట్ల చొప్పున ఆఫర్ చేసి బీఆర్ఎస్ పార్టీని వీడాలని చెప్పారని, నలుగురు ఎమ్మెల్యేలు సంచలన ఆరోపణలు చేశారు.

దీంతో పార్టీ ఆధినేత, సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. వీడియోలో ఉన్న నందకుమార్, రామతీర్థ, సింహయాజీలను బీజేపీయే పంపించి తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించిందన్నారు. ఓసార అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి వీడియో ప్రసారం చేయించారు.

ఆ తరువాత ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని సిట్ ను ఆదేశించడంతో నందకుమార్, రామతీర్థ, సింహయాజీలను అరెస్టు చేశారు. వీరిని విచారించి, వీరి వెనుక ఎవరున్నదన్న విషయం బయటకు తీయాలని ప్రయత్నించారు. అయితే కేసీఆర్ కు ఊహించని షాక్ తగిలింది. తాను దూకుడుగా వెళ్లి బీజేపీని ఇరుకున పెట్టాలని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఎమ్మేల్యేల వ్యవహారంలో బీజేపీపై ఎన్ని ఆరోపణలు వచ్చినా.. ఆ పార్టీ నాయకులు పెద్దగా స్పందించలేదు. సైలెంట్ గా ఈడీని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది.

ముందుగా నలుగురు ఎమ్మెల్యేల్లో ఒకరైన ఫైలట్ రోహిత్ రెడ్డిని ఈడీ అధికారులు విచారించారు. ఆ తరువాత అరెస్టయిన వారిలో ఒకరైన నందకుమార్ ను కూడా వివరాలు అడిగారు. అయితే రోహిత్ రెడ్డి ఈడీపై సంచలన ఆరోపణలు చేశారు. తనను కావాలనే ఇరికించడానికి నందకుమార్ ను విచారిస్తున్నారని అన్నారు. మరోవైపు అరెస్టయిన వారు ఈ కేసును సీబీఐతో విచారించాలని కోర్టును సంప్రదించారు. ఎమ్మెల్యేల వ్యవహారం ప్రీ ప్లాన్డుగా జరిగిందని, ఇందులో సీఎం కేసీఆర్ ఇన్వాల్వ్ అయ్యారని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు సీబీఐ విచారణకు అనుమతి ఇచ్చింది.

ఓ వైపు ఈడీ.. మరో వైపు సీబీఐ విచారణకు దూసుకొస్తుండడంతో ఇప్పుడు కేసీఆర్ డీఫెన్స్ లో పడ్డట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ విచారణను అడ్డుకునేందుకు ఆయన కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యే కోనుగోలుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, దీని వెనుక ఎంత పెద్ద వారున్నా వారిని విడిచిపెట్టేది లేదని ఆరోపించిన కేసీఆర్ ఇప్పుడు ఈడీ, సీబీఐ నుంచి ఎలా భయటపడుతారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.