Begin typing your search above and press return to search.

కేసీఆర్ సర్వే: ఆ మంత్రులకు ఈసారి సీట్లు డౌటే?

By:  Tupaki Desk   |   22 Nov 2022 12:30 AM GMT
కేసీఆర్ సర్వే: ఆ మంత్రులకు ఈసారి సీట్లు డౌటే?
X
దూసుకొస్తున్న బీజేపీని కాచుకొని వచ్చేసారి మరోసారి గెలవాలంటే ఈసారి గెలుపు గుర్రాలను పట్టాలని కేసీఆర్ డిసైడ్ అయ్యాడు. ఈ మేరకు మునుగోడు జోష్ లో తెలంగాణలో బలమైన అభ్యర్థుల వేట మొదలుపెట్టారు. సర్వేలతో ఎవరికి సీట్లు ఇవ్వాలి? ఎవరికి ఇవ్వకూడదన్నది వ్యూహాలు రచిస్తున్నారు. మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు గులాబీ బాస్ వ్యూహరచనలో మునిగిపోయాయి. మిగతా పార్టీల కంటే కూడా ముందున్నారు. నేతలు, కార్యకర్తలను ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు.

నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులు, నేతల పనితీరును అంచనావేస్తూ పార్టీని వచ్చే ఎన్నికల కోసం మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉండడం.. రాష్ట్రంలో బీజేపీ బలంగా పుంజుకోవడంతో కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరిస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసం ఇప్పటి నుంచే సర్వేలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే పార్టీ ఎమ్మెల్యేలు, నేతల పనితీరు, పార్టీ పరిస్థితి ఆధారంగా నియోజకవర్గాలను మూడు కేటగిరీలుగా విభజించారు. సర్వేల ఆధారంగా ఖచ్చితంగా గెలిచే, ట్రాయంగిల్ ఫైట్ ఉన్న నియోజకవర్గాలను గుర్తించి మూడు కేటగిరీలుగా పరిగణించారు. ఖచ్చితంగా గెలిచే కేటగిరి ఏలో 38 నుంచి 44 , కాంగ్రెస్ బలంగా ఉండి కాస్త కష్టపడితే గెలిచే బి కేటాగిరిలో 30-35 నియోజకవర్గాలను గుర్తించారు.

ఇక ట్రాయాంగిల్ ఫైట్ లో బీజేపీ, కాంగ్రెస్ లతో పోరాడి వీక్ గా ఉన్న నియోజకవర్గాలను డేంజర్ జోన్ 'సీ'గా కేసీఆర్ విభజించినట్టు తెలుస్తోంది. ఈ 'సీ' కేటగిరీ సీట్లలో ఏకంగా టీఆర్ఎస్ మంత్రులు కూడా ఉన్నారని.. వారి గెలుపు అసాధ్యం అని తెలిసి కొత్త వారికి టికెట్ ఇచ్చే యోచనలో కూడా కేసీఆర్ ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.

ఈ సీ కేటగిరీ డేంజర్ జోన్ మంత్రులతో సహా 10 మందితో కూడిన జాబితా కేసీఆర్ కు అందిందని.. ఇక్కడ గెలుపు కోసం వేరే వ్యక్తులను ప్రచారం కోసం కేసీఆర్ బ్యాచ్ లు సిద్ధం చేస్తారని అంటున్నారు. మిగతా ఇన్ చార్జీలకు కూడా కేటగిరీల వారీగా ఇన్ చార్జీలను నియమిస్తారని చెబుతున్నారు.

క్యాడర్ తో తరచూ భేటిలు.. పార్టీ కార్యక్రమాలు, నేతల మధ్య సమన్వయం చూసుకొని గెలిపించే బాధ్యతలను ఇన్ చార్జీలకు అప్పగిస్తారని తెలుస్తోంది. సర్వేల ప్రకారం ఓడిపోయే స్థానాలపై ఫోకస్ చేసి నేతలను మార్చి.. ప్రచారంలో దూకుడు పెంచి గెలవాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈసారి గెలుపు కోసం అసెంబ్లీ టికెట్లు కూడా కొందరికి ఇవ్వవద్దని.. మంత్రులైనా తొలగించవచ్చని భావిస్తున్నారు. కేసీఆర్ సర్వే రిపోర్ట్ ఇప్పుడు అందరిలోనూ గుబులు రేపుతోంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.