Begin typing your search above and press return to search.
హైదరాబాద్‌లో మరో పోలీస్ కి కరోనా ?
By: Tupaki Desk | 18 April 2020 9:50 AM GMTకరోనా కట్టడిలో భాగంగా లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. అయితే , ఈ సమయంలో కూడా పోలీసులు అవిశ్రాంతంగా ప్రజల ప్రాణాల కోసం శ్రమిస్తున్నారు. అయితే , అక్కడక్కడా పోలీసులు కూడా ఈ కరోనా భారిన పడుతున్నారు. హైదరాబాద్ లో మరో పోలీస్ కి కరోనా పాజిటివ్ వచ్చిందని ప్రసార మాధ్యమాల్లో ప్రచారం అవుతుంది. అతడికి కరోనా అనుమానితుడిగా ఉన్న కానిస్టేబుల్ కు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా వైద్యులు గుర్తించారని , ఈ కానిస్టేబుల్ చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నారని చెప్తున్నారు. దీనితో వెంటనే అతణ్ని చికిత్స కోసం గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించినట్టు సమాచారం.
తెలంగాణలో ఈ నెల మొదటి వారంలో హైదరాబాద్ విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ కు వైరస్ ఉన్నట్టుగా గుర్తించారు. దీంతో పోలీసు శాఖలో కరోనా కలవరం మొదలైంది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడిన సైఫాబాద్ పోలీస్ స్టేషన్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అతనితో సన్నిహితంగా ఉన్న మరో 12 మంది కానిస్టేబుళ్లను కూడా ఆ సమయంలోనే క్వారంటైన్ కు తరలించారు.
ఇకపోతే , కాగా ఇప్పటికే తెలంగాణలో కరోనా పాజిటివ్ ల సంఖ్య 766కు చేరిన సంగతి తెలిసిందే. హైదరాబాద్, నిజామాబాద్, సూర్యాపేటల్లో కరోనా పాజిటివ్‌ల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. అయితే, కేవలం గురు, శుక్ర వారాల్లోనే దాదాపు 116 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో శుక్రవారం ఒక్కరోజు మరో 30 మందికి కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఈ విషయాన్ని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ చెప్పారు.