Begin typing your search above and press return to search.
చీకోటి ప్రవీణ్ కేసు: హడలెత్తుతున్న ఎమ్మెల్యేలు మాజీలు!
By: Tupaki Desk | 10 Aug 2022 11:30 AM GMTచీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారం ఇప్పుడు ఆయనతో లింక్ ఉన్న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల మెడకు చుట్టుకునేలా ఉంది. క్యాసినో వ్యవహారంలో హవాలా దందాలో చాలా మంది మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నట్టు తేలడంతో వారంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. క్యాసినో వ్యవహారంలో కొందరు ప్రజాప్రతినిధులతో తనకు సంబంధాలున్నాయని ప్రవీణ్ ఒప్పుకున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఇటీవల ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక మాజీ ఎమ్మెల్యేలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 7 నుంచి విచారణకు హాజరు కావాల్సిందిగా వారిని ఆదేశించింది. ప్రవీణ్ ఇచ్చిన సమాచారంతో పాటు ఆయన వాట్సాప్ చాట్ ఆధారంగా నలుగురికి నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది.
సినీ రాజకీయ ప్రముఖుల నుంచి కోట్లాది రూపాయలను తీసుకొని వారు విదేశాల్లో క్యాసినో ఆడేందుకు డాలర్లను ఏర్పాటు చేయడం చీకోటి ప్రవీణ్ వ్యాపారమని ఈడీ భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రముఖుల నల్ల ధనాన్ని హవాలా రూపంలో అందుబాటులోకి తెస్తున్నారని, దీని వెనుక ఎవరెవరు ఉన్నారనే విషయాన్ని తెలుసుకునేందు చీకోటి ప్రవీణ్ తో పాటు మరికొంతమందిని విచారించే అవకాశం ఉంది.
తనకు ప్రాణహాని ఉందని, భద్రత కావాలని ప్రవీణ్ ఇప్పటికే పోలీసులను కోరాడు. తన గురించి కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న తనను సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఈడీ విచారణ పూర్తయిన తరువాత అన్ని విషయాలు చెబుతానని, కానీ ఇప్పుడు ప్రసారం అవుతున్నదంతా అవాస్తవమని అన్నారు. ఫేస్బుక్ లో నా పేరుతో కొందరు అకౌంట్లు క్రియేట్ చేసి మార్ఫింగ్ ఫొటోలు పెడుతున్నారన్నారు.
సంచలనాత్మకమైన వాట్సాప్ సందేశాలతో ఓ మంత్రితోపాటు పలువురు ఎమ్మెల్యేలకు సంబంధాలున్నాయని ఈడీ బలంగా విశ్వసిస్తోంది. దీనికి తగ్గట్టుగా సాగిన వాట్సాప్ చాట్ లను రిట్రీవ్ చేసిన ఈడీ సంబంధిత ప్రముఖులకు శ్రీముఖాలు జారీ చేయాలని భావిస్తోంది. ఈడీ నిజంగానే తమను పిలుస్తుందా? పిలిస్తే ఏంటన్న పరిస్థితిపై ఎమ్మెల్యేలు ఒకరినొకరు చర్చించుకుంటున్నట్టు అనుచరుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈడీకి ఆధారాలు దొరికితే పరిస్థితి ఏంటన్న దానిపైనే నేతలు ఆందోళన చెందుతున్నట్టు తెలిసింది. పైగా తమను విచారణకు రావాలని నోటీసులు ఇస్తే రాజకీయ భవిష్యత్ పై తీవ్ర ప్రభావం ఉంటుందన్న కలవరం కూడా నేతలను వెంటాడుతోంది.
ఇప్పటికే ఈడీ దాడులతో రాజకీయంగా రకరకాల చర్చలు సాగుతున్నాయి. అటు బీజేపీ నేతలు కూడా నిత్యం ఈడీ దాడులపై ప్రకటనలు చేస్తుండడంతో ప్రముఖ నేతలకు నిద్రపట్టకుండా చేస్తోంది.