Begin typing your search above and press return to search.
చిన్నసైజు జూపార్కును తలపించేలా చీకోటి ఫాంహౌస్.. సర్ ప్రైజింగ్ ట్విస్టు ఇదే
By: Tupaki Desk | 30 July 2022 3:43 AM GMTగడిచిన మూడు రోజులుగా తెలుగురాష్ట్రాల్లో సంచలనంగా మారిన చీకోటి ప్రవీణ్ యవ్వారం సంచలనంగా మారింది. ఇంతకాలం పరిమిత సర్కిళ్లలో మాత్రమే తెలిసిన అతడు.. ఈడీ సోదాల పుణ్యమా అని ఇప్పుడు అందరికి సుపరిచితుడు అయ్యాడు. ఇతడికి చెందిన వ్యవసాయ క్షేత్రం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని సాయిరెడ్డి సమీపంలో ఉంది. ఈ ఫాంహౌస్ 20 ఎకరాల్లో ఉందని కొందరు.. కాదు అది 12 ఎకరాల్లో ఉందని కొందరు చెబుతున్నారు. ఈ ఫాంహౌస్ లో పెద్ద ఎత్తున జంతువులు.. పక్షులు ఉన్నాయని.. అవన్నీ కూడా నిబంధనలకు విరుద్దంగా ఉన్నట్లుగా మీడియాలో వార్తలు రావటం తెలిసిందే.
ఇతగాడి ఫాంహౌస్ లో పెద్ద ఎత్తున జంతువులు ఉన్నప్పటికీ అటవీ శాఖాధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నట్లుగా విమర్శల నేపథ్యంలో.. అటవీశాఖ అధికారులు శుక్రవారం ప్రవీణ్ ఫాంహౌస్ కు వెళ్లి పరిశీలించారు. లోపల ఉన్న జంతువులను చూసిన వారంతా షాక్ కు గురయ్యారు. జంతుప్రేమికుడిగా తనను తాను చెప్పుకునే ప్రవీణ్.. తన అభిరుచికి తగ్గట్లే.. పెద్ద ఎత్తున జంతువుల్ని కలెక్టు చేసి పెట్టుకున్నారు. అయితే.. ఇవన్నీ కూడా విదేశాల నుంచి తెచ్చుకున్నట్లు గుర్తించారు.
ఈ ఫాంహౌస్ ను దాదాపు ఆరేడేళ్ల క్రితం కొనుగోలు చేసినట్లుగా చెబుతున్నారు. ఇందులో ఫౌల్ట్రీతో పాటు మిగిలిన ప్రదేశాల్లో షెడ్లను నిర్మించినట్లు గుర్తించారు. అతడి ఫాంహౌస్ ను చూసిన అటవీ శాఖ అధికారులు అవాక్కు అవుతున్నారు. విదేశాల నుంచి తెప్పించిన పలు జంతువులతో ఫాంహౌస్ కాస్తా మినీసైజ్ జూగా ఉన్నట్లుగా చెబుతున్నారు.
ఇందులో విదేశీ కొండ చిలువలు, ఊసరవెల్లులు, ఆఫ్రికన్ పాములు, మకావ్ చిలుకలు, హంసలు, బాతులు, ఉడుములు, బల్లి జాతికి చెందిన రకాలు, జింక రకం మేకలు, టర్కీ కోళ్లు, ఇగ్వానా, ఆస్ట్రిచ్ పక్షులు, మేలు జాతి గుర్రాలు, సాలీళ్లు, బల్లులు.. వివిధ రకాల కుక్కలు, పక్షులతో పాటు ఆవులు, గేదెలను కూడా పెంచుతున్నట్లుగా గుర్తించారు.
వీటిని క్రమపద్దతిలో పెంచుతున్న తీరు.. ప్రమాదకర కొండ చిలువలు లాంటి వాటిని ప్రత్యేకంగా ఎన్ క్లోజర్లు ఏర్పాటు చేసి ఉంచినట్లుగా గుర్తించారు. అంతేకాదు.. ఇత్తడితో తయారు చేసిన రెండు సింహపు విగ్రహాలు.. పురాతన రథంతో పాటు జట్కా కూడా ఉన్నట్లు గుర్తించారు. ప్రవీణ్ ఫాంహౌస్ మొత్తాన్ని తనిఖీ చేసిన అటవీ శాఖ అధికారులు.. అక్కడ ఉన్న జంతుజాలం మొత్తం నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్లుగా తాము గుర్తించినట్లుగా చెబుతున్నారు.
తమ ప్రాథమిక పరిశీలనలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లుగా ఏమీ కనిపించలేదని.. పాంహౌస్ లోని జంతుజాలంపై ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని చెబుతున్నారు. మీడియాలో మాత్రం రూల్స్ కు భిన్నంగా జంతువుల్ని పెంచుతున్నట్లుగా వార్తలు వచ్చినప్పటికీ.. అందుకు భిన్నంగా అన్ని రూల్ ప్రకారమే పెంచుతున్నట్లుగా తేలటం అసలుసిసలు ట్విస్టుగా చెబుతున్నారు.