Begin typing your search above and press return to search.
చీకోటి ప్రవీణ్ 'క్యాసినో' మాత్రమే కాదు అంతకు మించి చాలానే ఉందా?
By: Tupaki Desk | 29 July 2022 4:02 AM GMTక్యాసినో నిర్వహణతో కోట్లాది రూపాయిల్ని హవాలా పద్దతిలో అక్రమ రవాణాకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్ కు సంబంధించిన వివరాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అతడి వ్యాపారానికి సంబంధించిన షాకింగ్ అంశాలు తెర మీదకు వస్తున్నాయి. తొలుత అనుకున్నట్లుగా చీకోటికి సంబంధించిన చీకటి కోణాలెన్నో ఉన్నాయని చెబుతున్నారు.
క్యాసినోతోనే అయిపోలేదని.. అంతకు మించి అన్నట్లుగా హవాలా మార్గంలో భారీ మొత్తాల్ని మార్చటం.. అక్రమ బంగారు దిగుమతితో పాటు..పెద్ద ఎత్తున భూములకు సంబంధించిన పత్రాలు కూడా సోదాల సందర్భంగా లభించటంతో ఇతగాడి వ్యవహరం భారీగా ఉన్నట్లుగా భావిస్తున్నారు. గడిచిన ఐదేళ్లలో భారీ ఎత్తున క్యాసినోలను నిర్వహించిన చీకోటి ప్రవీణ్.. మొత్తం ఎన్ని క్యాసినోలను నడిపించి ఉంటాడు? అనే అంశంపై ఈడీ ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది.
ఇతడి దందా లెక్క తేల్చటంపై అధికారులు తలమునకలై ఉన్నారు. అంతేకాదు.. ఇతడు నిర్వహించిన క్యాసినోలకు వెళ్లిన పంటర్ల (జూదం ఆడినోళ్లు) ఆర్థిక లావాదేవీల గురించి కూడా ఆరా తీస్తున్నట్లు చెబుతున్నారు. నేపాల్ లో నిర్వహించిన క్యాసినో నిర్వహణలో భారీగా ఫెమా ఉల్లంఘన జరిగిందని భావిస్తున్నారు. పెద్ద ఎత్తున సొమ్ము హవాలా మార్గంలో చేతులు మారినట్లుగా అనుమానిస్తున్నారు.
ప్రవీణ్ కు కడ్తాల్ లో ఫామ్ హౌస్.. నగరంలోని కమర్షియల్ కాంప్లెక్సులతో పాటు మరిన్నిప్లాట్లు కూడా ఉన్నట్లుగా అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. హవాలతో పాటు.. చెన్నైలోని ఒక ఏజెంట్ తో ఉన్న సంబంధాల మీదా ఆరా తీస్తున్నారు. హవాలా దందాలో అతడు కీలకంగా వ్యవహరించినట్లుగా తెలుస్తోంది. దుబాయ్ నుంచి విమానాల్లో బంగారం అక్రమ దిగుమతిపై దర్యాప్తు సంస్థల నిఘా ఎక్కువగా ఉన్న నేపత్యంలో స్మగ్లర్లు నేపాల్ ద్వారా తెప్పిస్తున్నట్లుగా అంచనా వేస్తున్నారు.
ప్రవీణ్ వ్యవహారంలో బంగారం అక్రమ రవాణా కూడా ఉన్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వివరాల్ని బయటకు తీసే పనిలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇక.. ప్రవీణ్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున రాజకీయ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఆ జాబితా భారీగా ఉండటం గమనార్హం. తెలంగాణకు చెందిన ఒక మాజీ మంత్రితోపాటు ఏపీకి చెందిన మరో మాజీ మంత్రి సన్నిహితంగా ఉంటారని చెబుతున్నారు.
వీరితో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ.. ముగ్గురు ఎమ్మెల్యేలు.. ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యే.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేతో పాటు తెలంగాణకు చెందిన ఒక డీసీసీబీ ఛైర్మన్.. క్రిష్ణాజిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు.. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలతో ప్రవీణ్ కు పరిచయాలు ఉన్నట్లు తెలుస్తోంది. అతగాడి సోషల్ మీడియా ఖాతాల్ని సైతం ఈడీ విశ్లేషిస్తున్నట్లుగా చెబుతున్నారు.