Begin typing your search above and press return to search.
రాజకీయాల్లోకి వస్తానంటున్న చీకోటి ప్రవీణ్?
By: Tupaki Desk | 19 Aug 2022 2:30 AM GMTక్యాసినో కేసులో సంచలనంగా మారిన చీకోటి ప్రవీణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంచలనంగా మారిన అతడి ఉదంతం.. ఈడీ తనిఖీల కారణంగా అయ్యగారికి సంబంధించిన ఎన్నో విషయాలు బయటకు వచ్చాయి.
ప్రస్తుతం క్యాసినో కేసులో ఉన్న ఆయన్ను.. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి కొందరు రాజకీయ నేతల పేర్లు చెప్పమని బలవంతం చేస్తున్నారని.. లేదంటే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. తాను లీగల్ గానే వ్యాపారం చేశానని.. ఎలాంటి తప్పు చేయలేదన్నారు. ఈడీ విచారణ నుంచి తాను క్లీన్ చిట్ తో బయటకు వస్తానని చెప్పారు.
తనను చంపేందుకు "హిట్ మ్యాన్" అనే యాప్ లోడబ్బులు కూడా చెల్లించినట్లుగా కొందరు ఫోన్ చేసి బెదిరిస్తున్నారన్న ఆయన.. ఈడీ నుంచి క్లీన్ చిట్ వచ్చినంతనే తాను రాజకీయాల్లోకి రానున్నట్లు వెల్లడించారు.
తనకు వస్తున్న బెదిరింపుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పిన ఆయన.. మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. మీడియాలో వచ్చినట్లుగా క్యాసినో ప్రచారానికి కొందరు నటీనటులకు డబ్బులు ఇచ్చిన మాట వాస్తవమే అయినప్పటికీ.. మీడియాలో పేర్కొన్నంత భారీగా మాత్రం తాను ఇవ్వలేదని చెప్పటం గమనార్హం.
రెండు తెలుగు రాష్ట్రా్లోని రాజకీయ నేతలకు తనకు సంబంధాలు ఉన్నాయని.. అవన్నీ వ్యక్తిగతమే తప్పించి.. అంతకు మించి మరింకేమీ లేదన్నారు. చినజీయర్ స్వామితో సంబంధం గురువుకు- శిష్యుడికి మధ్య ఉండేదన్న ఆయన.. తనకు పలువురు రాజకీయ పార్టీలకు చెందిన నేతలతో సంబంధాలు ఉన్నట్లు చెప్పారు.
వల్లభనేని వంశీ మంచి స్నేహితుడని.. కొడాలి నానితో పరిచయం ఉందని.. అయితేఇద్దరికి మధ్య ఆర్థిక పరమైన లావాదేవీలు మాత్రం లేవన్నారు. క్యాసినోకు టీఆర్ఎస్.. టీడీపీ.. కాంగ్రెస్.. వైసీపీకి చెందిన నేతలు వస్తారని.. వారంతా గాంబ్లింగ్ ఆడతారన్నారు. రాజకీయం వేరు.. వారి వ్యక్తిగత ఇష్టాయిష్టాలు వేరన్న విషయాన్ని మర్చిపోకూడదన్న ప్రవీణ్ మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.