Begin typing your search above and press return to search.
కాల్ రికార్డ్ తో ఎమ్మెల్యే రజినిని బుక్ చేసిన హెచ్ ఎం సస్పెండ్ ..
By: Tupaki Desk | 26 Oct 2019 8:41 AM GMTచిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే రజిని తన వాక్చాతుర్యం తో ఇటీవలే జరిగిన ఎన్నికలలో తన రాజకీయ గురువైన మాజీ మంత్రి పత్తిపాటి పై విజయం సాధించింది. ఆ తరువాత నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ .. ప్రజలలో ఉంటూ వైసీపీ ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రతి పథకం కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి అమలైయ్యేలా చూస్తున్నారు. ఈ తరుణంలో ఆమె పై ఒక వార్త వైరల్ గా మారింది. తన ఫోన్ కాల్ రికార్డ్ చేసినందుకు హెచ్ ఎం ని సస్పెండ్ చేయించారు అని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ మద్యే చిలకలూరిపేట శారదా హైస్కూల్ లో విద్యా కమిటీపై వివాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ వివాదంలో జోక్యం చేసుకున్న ఎమ్మెల్యే రజిని.. హెచ్ ఎం ధనలక్ష్మికి ఫోన్ చేసి ముందుగా ఆ వివాదం పై వేసిన కమిటీని రద్దు చేయాలని హుకుం జారీ చేసినట్టు చెప్తున్నారు.ఆ విషయాన్నిహెచ్ ఎం కమిటీకి తెలియజేశారు. అలాగే ఎమ్మెల్యే తనతో ఫోన్ లో మాట్లాడిన వాయిస్ రికార్డును కూడా కమిటీ ముందు వినిపించినట్టు చెప్తున్నారు.
ఈ విషయంపై ఎమ్మెల్యే రజిని సీరియస్ అయ్యి ... తన వాయిస్ రికార్డును బయటకు వినిపించడంపై హెచ్ ఎం ధనలక్ష్మిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ప్రధానోపాధ్యాయురాలిపై విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదుతో హెచ్ ఎం ధనలక్ష్మిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు అని రాజకీయ వర్గాలలో జోరుగా చర్చ నడుస్తుంది.