Begin typing your search above and press return to search.
పార్టీలోని కుట్రలపై భగ్గుమన్న వైసీపీ ఎమ్మెల్యే
By: Tupaki Desk | 2 Oct 2019 8:07 AM GMTవైసీపీ మహిళా ఎమ్మెల్యే తిరగబడింది. అదేదో ప్రతిపక్ష టీడీపీ నేతలపై ఆమెకు కోపం కాదు.. ఏకంగా సొంత పార్టీ నేతల తీరుచూసే ఆమెలో ఆగ్రహం పెల్లుబుకింది. జగనన్న ఆశయాలు అమలు చేయాలని ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చిన చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే రజినీ సొంత పార్టీలో తనపై జరుగుతున్న కుట్రలు - కుతంత్రాలు భరించలేక ఓపెనప్ అయ్యారు. పట్టణంలోని ఎస్ ఎంఎస్ గార్డెన్స్ లో వైసీపీ నాయకులు - కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆమె వైసీపీ నేతలపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
వైసీపీ ఎమ్మెల్యే రజినీ మాట్లాడుతూ నా అనుకున్న వాళ్లు సైతం తనను అడ్డుకోవాలని - నియంత్రించాలని చూస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అందరి అండదండలను తనకు కావాలని .. నిస్వార్థంగా పనిచేస్తానని అన్నారు. తన వెంట ఉండి వెన్నుపోటు పొడవాలని చూసే వారి అంతుచూస్తానని.. అదే తన నైజం అంటూ వైసీపీ ఎమ్మెల్యే రజినీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను అవినీతి గద్దలను తరిమివేయాలని జగన్ పార్టీలో చేరానని.. చిలకలూరిపేటకు పట్టిన పీడను వదిలిస్తానని ఎమ్మెల్యే రజినీ ఆగ్రహించారు.. అయితే కొన్ని దుష్ట శక్తులు తన కలలను చిదిమివేయాలని చూస్తున్నారని ఆమె మండిపడ్డారు.
తాను గెలిచి నాలుగు నెలలు అయినా ఆ ఆనందం లేదని.. సొంత పార్టీ నేతలతో యుద్ధం చేయాల్సి వస్తోందని ఎమ్మెల్యే రజినీ మండిపడ్డారు. ఆడపిల్లనైనా తాను సొంత పార్టీ నేతలతో నాలుగు వైపులా యుద్ధం చేయాల్సి వస్తోందని.. వారు శత్రువులు కాదని సొంత పార్టీ నేతలే అని ఆమె వాపోయారు.