Begin typing your search above and press return to search.
బాలుడిపై ధూషించి.. నాలుకతో బూట్లు తూడిపించి..: యూపీలో దారుణం
By: Tupaki Desk | 20 April 2022 12:30 AM GMTఓ వైపు టెక్నాలజీతో ప్రపంచం దూసుకుపోతుండగా.. దేశంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంకా కుల వవివక్ష కొనసాగుతూనే ఉంది. కొందరు నిమ్నకులాల వారిపై అగ్ర కులాలకు చెందిన వారు ఇష్టమొచ్చిన రీతిలో ప్రవర్తిస్తున్నారు. అమాయక పేదలు అని చూడకుండా.. వారిని కష్టపెడుతూ.. అవమానిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు.
తాజాగా ఉత్తరప్రదేశ్లోని ఓ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఓ మైనర్ ను కొందరు యువకులు దారుణంగా అవమానిస్తూ హింసించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. అయితే ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు సదరు నిందితులను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఏప్రిల్ 10న ఈ సంఘటన జరగగా కొన్ని రోజుల తరువాత సోషల్ మీడియాలో వైరల్ కావడం చర్చనీయాంశంగా మారింది.
ఉత్తరప్రదేశ్లో రాయబరేలిలో జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. 2 నిమిషాల 30 సెకన్లు ఉన్న ఈ వీడియోలో ఓ బాలుడు తన చెవులు పట్టుకొని గుంజీలు తీస్తున్నాడు. కొందరు మోటార్ బైక్ పై కూర్చొని ఆ బాలుడిని ధూషిస్తున్నారు. భయంతో వణుకిపోతున్న ఆ బాలుడిని చూసిన వాళ్లు పైశాచికంగా నవ్వుతున్నారు. అంతేకాకుండా ఆ బాలుడితో బైక్ పై కూర్చున్నవారు తమ బూట్లను నాలుకతో నాకించారు. అయితే ఆ బాలుడు దళిత వర్గానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. బాలుడిని అవమానించిన వారు అగ్ర వర్ణాలకు చెందిన వారని సమాచారం.
ఏప్రిల్ 10న జరిగిన ఈ సంఘటన తరువాత బాలుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఏడుగురు నిందితులను గుర్తించి వారిని అరెస్టు చేసినట్లు రాయబరేలీ పోలీసులు తెలిపారు. అయితే కొన్ని రోజుల తరువాత ఈ వీడియో సోషల్ మీడియాలోవైరల్ అవుతోందని సినియర్ పోలీసు అధికారి అశోక్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పదో తరగతి చదువుతున్న ఆ బాలుడి తండ్రి మరణించాడు. దీంతో తల్లితో కలిసి పొలం పనులు చేశాడు. అయితే వాటికి సంబంధించిన డబ్బులు ఇవ్వాలని వారిని అడగ్గా.. ఇలా హింసించినట్లు పోలీసులకు తెలిపారు. మమ్మల్నే డబ్బులు అడుగుతావా అని ఆ బాలుడిని ధూషించినట్లు ఆయన పేర్కొన్నారు.
అంతేకాకుండా నిందితుల్లో ఒకరు బాలుడిని పట్టుకొని దాడి చేశాడని, ఆ తరువాత తమ బూట్లను నాకమని బలవంతం పెట్టడంతో ఆ బాలుడు బూట్లను నాలుకతో తూడ్చాడని అన్నారు. ఈవ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడం చర్చనీయాంశంగా మారింది. మారుమూల గ్రామాల్లో ఇంకా ఇలాంటి సంఘటనలు జరగడం దారుణమని కొందరు దళితనేతలు ఖండిస్తున్నారు. ఇలాంటి వారిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.