Begin typing your search above and press return to search.
రేప్ వల్ల పుట్టిన పిల్లలకూ ఆస్తిహక్కు !!
By: Tupaki Desk | 5 Nov 2015 4:29 AM GMTఒక సంచలన తీర్పును వెల్లడించింది అలహాబాద్ హైకోర్టు. రోజురోజుకీ పెరిగిపోతున్న అత్యాచార ఘటనలతో పాటు.. ఆందోళన కలిగించే పరిణామాలపై తాజాగా వెల్లడించిన తీర్పు ప్రత్యేకమైనదిగా అభివర్ణిస్తున్నారు. అత్యాచారానికి ఒడికట్టిన దానికి బలైన మహిళకు.. ఆ ఘటన కారణంగా కలిగే సంతానానికి అత్యాచారానికి ఒడికట్టిన ఆస్తిలో సర్వ హక్కులు ఉంటాయని తేల్చింది. అయితే.. ఈ తీర్పునకు కొన్ని పరిమితులు విధించినప్పటికీ.. మొత్తంగా రేప్ బాధితురాలికి.. ఆ దుర్మార్గ ఘటనకు సంతానం కలిగితే.. అత్యాచారం చేసిన వ్యక్తి ఆస్తిలో వాటా ఇవ్వాల్సిందే.
అత్యాచారానికి గురైన ఒక మహిళకు పుట్టిన సంతానానికి సంబంధించి ఆస్తిహక్కుపై వేసిన వ్యాజ్యంపై తాజాగా తీర్పు ఇచ్చారు. అత్యాచారం కారణంగా జన్మించిన బిడ్డ కాబట్టి.. సదరు సంతానం ఆస్తిలో హక్కు ఉంటుందని తేల్చారు. అయితే.. ఇలాంటి బిడ్డను దత్తత ఇస్తే మాత్రం ఆస్తి మీద హక్కు లభించదని కూడా కోర్టు స్పష్టం చేసింది.