Begin typing your search above and press return to search.
కరోనాతో 29 రోజుల పసికందు మృతి !
By: Tupaki Desk | 16 April 2020 10:20 AM GMTకరోనా మహమ్మారి దెబ్బకి పిల్లల నుండి పెద్దలవరకు ప్రతి ఒక్కరు కూడా పిట్టల్లా రాలిపోతున్నారు. కొంతమంది ఈ మహమ్మారి తో పోరాటం చేసి విజయం సాధిస్తే , మరికొంతమంది మాత్రం కరోనా పై పోరాడుతూ ప్రాణాలు వదిలేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా లక్షా 35 వేల మందికి పైగా ప్రాణాలు తీసిన ఈ మహమ్మారి తాజాగా 29 రోజులు పసికందును కూడా బలి తీసుకుంది.
తాజాగా ఫిలిప్పీన్స్ లోని బటంగస్ ప్రావిన్స్ కు చెందిన 29 రోజుల శిశువు కరోనాబారినపడి ప్రాణాలు కోల్పోయాడు. ప్రపంచంలో కరోనా బారినపడి మరణించిన అత్యంత చిన్న కరోనా బాధితుడు ఈ పసికందే. కరోనా బారినపడిన ఈ చిన్నారికి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. దీంతో వైద్యులు పసికందుకు అత్యవసర చికిత్స అందించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇంతకుముందు ఫిలిప్పీన్స్ లో ఏడేళ్ల చిన్నారి కరోనావైరస్ సోకి మరణించింది.
కాగా , కరోనా కారణంగా దేశంలో మరణాల సంఖ్య 349కి చేరగా, మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 5,453కు చేరింది. బుధవారం మరో 14 కరోనా మరణాలు సంభవించాయని, కొత్తగా 230 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఫిలిప్పీన్స్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే ఇప్పటివరకు 58 మంది కరోనా నుంచి కోలుకున్నారని వెల్లడించింది. ఈ తరుణంలో కరోనా పై తప్పుడు వార్తలని ప్రచారం చేస్తున్న వారి పై అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటర్టే ఆగ్రహం వ్యక్తం చేసారు. అలాంటి వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.