Begin typing your search above and press return to search.
లాక్ డౌన్ లో పెరిగిన బాల్య వివాహాలు
By: Tupaki Desk | 5 Jan 2021 1:30 AM GMTప్రపంచ దేశాల ప్రజలను కరోనా అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. కరోనా దెబ్బకు అనివార్యమైన లాక్ డౌన్ వల్ల దాదాపు అన్ని రంగాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి. ఉద్యోగం, ఉపాధి కోల్పోయి లక్షలాది మంది రోడ్డున పడ్డారు. ఇదంతా నాణేనికి ఒకవైపు. లాక్ డౌన్ సమయంలో కుటుంబ సభ్యులంతా ఇంట్లోనే ఉండడం వల్ల గృహహింస కేసులు పెరిగిపోయాయి. దీనికితోడు, పాత బస్తీ వంటి ప్రాంతాల్లో కాంట్రాక్ట్ మ్యారేజ్ లు, బాల్య వివాహాలు గతంలో కన్నా ఎక్కువయ్యాయి. లాక్ డౌన్ సమయంలో పాతబస్తీలో 250 బాల్య వివాహాలు షాహీన్ స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. బడికెళ్లే వయసు ఆడపిల్లలకు బలవంతంగా పెళ్లిళ్లు చేశారని, కొంతమంది ఆడపిల్లలు ఇంట్లో వారితో పోరాడి వివాహాలను అడ్డుకున్నారని వెల్లడించింది.
మామూలుగానే పాతబస్తీతో పాటు జంటనగరాల్లోని కొన్ని ప్రాంతాలు, తెలంగాణలోని కొన్ని చోట్ల కాంట్రాక్ట్ మ్యారేజిలు, బాల్య వివాహాలు, బలవంతపు పెళ్లిళ్లు జరుగుతుంటాయి. అయితే, లాక్ డౌన్ సమయంలో ఇవి ఎక్కువయ్యాయి. సులువుగా, అతి తక్కువ ఖర్చుతో పెళ్లి తంతు ముగిసిపోవడం, అప్పు చేయాల్సిన అవసరం లేదన్న తల్లిదండ్రుల ఆలోచన బాల్యవివాహాలకు ఒక కారణంగా చెప్పవచ్చు. లాక్‌డౌన్ వల్ల కుటుంబ పెద్ద ఉపాధి కోల్పోవడం, ఆడపిల్ల భారం వదిలించుకోవాన్న ఆలోచనతో కొందరు బాల్యవివాహాలు చేశారు. కరోనాతో పాఠశాలలు మూతపడటంతో ఆడపిల్లలు ఇంటికే పరిమితం కావడం కూడా మరో కారణం. వలస కూలీలు అధికంగా ఉన్న మహబూబ్ నగర్, వికారాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాలలో లాక్‌డౌన్ ఎఫెక్ట్ తో చాలా మంది తమ స్వగ్రామాలకు తిరిగి వచ్చేశారు. పేదరికం, భవిష్యత్తుపై అనిశ్చితితో ఆడపిల్లలకు బాల్య వివాహాలు చేశారు. మధ్యాహ్న భోజన పథకం నిలిపివేయడం కూడా బాల్యవివాహాలు పెరిగేందుకు మరొక కారణం కావచ్చని షాహీన్ నిర్వాహకులు చెబుతున్నారు.