Begin typing your search above and press return to search.
ట్విట్టర్ లో బాలల అశ్లీల కంటెంట్...మరో కేసు నమోదు !
By: Tupaki Desk | 30 Jun 2021 4:31 AM GMTప్రముఖ సోషల్ మీడియా సంస్థ అయిన ట్విట్టర్ కి భారత్ లో వరుసగా రోజుకో షాక్ తగులుతుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఐటీ రూల్స్ విషయంలో వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ట్విట్టర్ ను కేసుల బెడద వదలడం లేదు. తాజాగా ట్విట్టర్ పై ఢిల్లీ పోలీస్ సైబర్ సెల్ మరో కేసు నమోదు చేసింది. భారత్ లో కంటెంట్ విషయంలో న్యాయ రక్షణను కోల్పోయిన తర్వాత ట్విట్టర్ పై నమోదైన నాలుగవ కేసు కావడం గమనార్హం.
ట్విట్టర్ లో బాలల అశ్లీల కంటెంట్ (చైల్డ్ పోర్నోగ్రఫీ) ఉందంటూ ఎన్సీపీసీఆర్ (జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ ) ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును స్వీకరించిన ఢిల్లీ సైబర్ పోలీసులు ట్విట్టర్ పై కేసు నమోదు చేశారు. వాస్తవానికి ట్విట్టర్ కు వ్యతిరేకంగా ఎన్సీపీసీఆర్ కొన్నిరోజుల కిందటే పలుమార్లు ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ ఢిల్లీ సైబర్ పోలీసులు స్పందించకపోవడంతో ఎన్సీపీసీఆర్ తాజాగా సమన్లు పంపింది. ఈ నేపథ్యంలో, ట్విట్టర్ పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసినట్టు ఢిల్లీ సైబర్ సెల్ డీసీపీ అన్యేష్ రాయ్ వెల్లడించారు. అయితే ట్విట్టర్ ఇండియా యొక్క 99 శాతం షేర్లను ట్విట్టర్ Inc కలిగి ఉన్నట్లు NCPCR తమ విచారణలో గుర్తించింది.మరోవైపు,భారత్‌లో అంతర్భాగమైన జమ్మూకశ్మీర్, లడఖ్ ల మ్యాప్‌లను తప్పుగా చూపి ఇప్పటికే ట్విట్టర్ సంస్థ విమర్శలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ విషయమై భజరంగ్ దళ్ నేత ప్రవీణ్ భాటి ఫిర్యాదు మేరకు ట్విట్టర్ ఇండియా ఎండీ మనీష్ పై మంగళవారం యూపీలోని బులందర్‌షహర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన సంగతి తెలిసిందే.