Begin typing your search above and press return to search.
ఆ షాంపు అమ్మకాలపై ఐదురాష్ట్రాల్లో నిషేధం
By: Tupaki Desk | 28 April 2019 8:13 AM GMTజాతీయ మానవ హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) సంచలన నిర్ణయం తీసుకుంది. పిల్లలకు హానిచేసే ఫార్మల్ డీహైడ్... జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ షాంపులో ఉందని.. వాటి అమ్మకాలు నిలిపివేయాల్సిందిగా ఐదురాష్ట్రాలకు ఎన్సీపీసీఆర్ చీఫ్ ప్రియాంక్ కనోంగ్ ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ - రాజస్థాన్ - అసోం - మధ్యప్రదేశ్ - జార్ఖండ్ రాష్ట్రాల చీఫ్ సెక్రెటరీలను ఈ మేరకు ఆదేశించారు. ఇందులో హానికారక ఔషధాలున్నట్టు కనుగొన్నందునే ఈ నిర్నయాలు తీసుకున్నట్టు ఆదేశాలు జారీ చేశారు.
ప్రఖ్యాత పిల్లల ఔషధాల తయారీ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ షాంపులలో పిల్లలకు హాని చేసే ఫార్మల్ డీహైడ్ ఉన్నట్టు రాజస్థాన్ డ్రగ్ కంట్రోల్ ఆథారిటీ పరీక్షించి కనుగొన్నది. 2016 నుంచి తమకు అందిన ఫిర్యాదుల ఆధారంగానే ఈ షాంపులను పరీక్షించగా ఈ వాస్తవం తేలిందని రాజస్థాన్ డ్రగ్ కంట్రోల్ ఆథారిటీ తెలిపింది. అందుకే పైనున్న 5 రాష్ట్రాల్లో శాంపిల్స్ సేకరించి ప్రభుత్వ లాబోరేటరీల్లో పరీక్షించాల్సిదిగా అధికారులను ప్రభుత్వం కోరింది.
కాగా ఇటీవల మరిన్ని ఫిర్యాదు అందడంతో ఈనెల 15న ఐదు రాష్ట్రాల చీఫ్ సెక్రెటరీలను పిలిపించి తక్షణమే ల్యాబ్ పరీక్షలు చేసి ఫలితాలు ఇవ్వాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ కోరింది.
అయితే టాల్కంపౌడర్ పైకూడా శాంపిల్స్ సేకరించగా.. అవి పరిశోధన సాగుతున్నాయని రిపోర్ట్ రాగానే టాల్కం పౌడర్ పై కూడా నిషేధాలు వెలువడనున్నాయని సమాచారం. నాణ్యత ప్రమాణాలు లేని ఉత్పత్తుల అమ్మకాలను ఎట్టి పరిస్థితుల్లో అమ్మనిచ్చేది లేదని.. రేపటి పిల్లల భవిష్యత్ కోసం జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుందని కమిషన్ చీఫ్ ప్రియాంక్ కనోంగ్ తెలిపారు.