Begin typing your search above and press return to search.
పిల్లల ఇంటిపేరును డిసైడ్ చేసే పవర్ తల్లికే.. సుప్రీం కీలక వ్యాఖ్య
By: Tupaki Desk | 29 July 2022 4:10 AM GMTకీలక అంశానికి సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఒక కేసు విచారణలో పిల్లల ఇంటి పేరును నిర్ణయించే అధికారం తల్లికే సంపూర్ణ హక్కు ఉంటుందని స్పష్టం చేసింది.
అయితే.. ఇదంతా తండ్రిని కోల్పోయిన పిల్లల విషయంలో కావటం గమనార్హం. తండ్రి మరణానంతరం బిడ్డకు సహజ సంరక్షకురాలిగా తల్లే అవుతుంది కాబట్టి.. ఆ బిడ్డకు ఇంటి పేరు ఏది ఉండాలనే దానిపై ఆమెదే అధికారమంతా అని సుప్రీం తేల్చి చెప్పింది.
ఇదంతా ఎందుకంటే.. తన పిల్లల ఇంటి పేరును రెండో భర్త ఇంటి పేరు పెట్టాలన్న దానిపై ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని ఈ సందర్భంగా సుప్రీం కొట్టి వేసింది. ఏపీ హైకోర్టు తీర్పు ప్రకారం మహిళ రెండో భర్తను సవతి తండ్రిగా పేర్కొనాలంటే ఇచ్చిన ఉత్తర్వులను తప్పు పట్టింది.
రెండో భర్తను సవతి తండ్రిగా చేర్చాలని హైకోర్టు ఆదేశించటం అనాలోచితం.. క్రూరమైన చర్యగా సుప్రీం కోర్టు అభివర్ణించింది.
ఇలాంటి నిర్ణయంతో మానసికంగా పిల్లలపై ఎంతో ప్రభావితం చూపుతుందని పేర్కొంది. అంతేకాదు.. ఆత్మగౌరవానికి కూడా ఇలాంటి తీరు ఇబ్బందిని కలిగిస్తుందని చెప్పింది.
దత్తత ఇచ్చే విషయంలోనూ తల్లికే పూర్తి హక్కు ఉంటుందని చెప్పిన సుప్రీం.. ఇలాంటి కేసుల్లో పిల్లల ప్రయోజనాలకే పెద్ద పీట వేయాలని స్పష్టం చేసింది. భర్త మరణించిన వేళలో.. పిల్లల ఇంటిపేర్లు ఏం ఉండాలన్న దానిపై తల్లికే అధికారమంతా అన్న విషయాన్ని సుప్రీంకోర్టు తాజా తీర్పు స్పష్టం చేసిందని చెప్పాలి.