Begin typing your search above and press return to search.

తీవ్ర అనారోగ్యంతో చిన్నారి.. చివరి కోరిక పవన్ ను చూడాలనే

By:  Tupaki Desk   |   6 July 2021 3:30 AM GMT
తీవ్ర అనారోగ్యంతో చిన్నారి.. చివరి కోరిక పవన్ ను చూడాలనే
X
రాజకీయంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను విమర్శించే వారు.. ఆయనలోని తప్పుల్ని ఎత్తి చూపే వారు సైతం వ్యక్తిగతంగా అతగాడి యాక్టివిటీస్ మాత్రమే కాదు.. అతడి మైండ్ సెట్ కు ఫిదా అవుతారు. అదే పవన్ కు బలం. సూటిగా ఉండటం.. స్నేహపూర్వకంగా మాట్లాడటం.. వీలైనంతవరకు సాయం చేయాలన్న లక్ష్యంతో పని చేస్తుంటారు. కరోనా సెకండ్ వేవ్ తో పాటు.. తాను స్వయంగా కరోనా బారిన పడిన నేపథ్యంలో తన వ్యవసాయ క్షేత్రానికి పరిమితమయ్యారు. అదేమిటో కానీ టాలీవుడ్ లో మరే హీరోకు లేనంత ఫ్యాన్ మొయిల్ పవన్ సొంతం. అమ్మాయిలు మొదలు కాలేజీ కుర్రాళ్ల వరకు పవన్ ను విపరీతంగా అభిమానించి ఆరాధించేటోళ్లు చాలానే మందే ఉంటారు.

తాజాగా ఆయన్ను స్వయంగా చూడాలని.. మాట్లాడాలని తపిస్తోంది పన్నెండేళ్ల ఒక అమ్మాయి. పవన్ ను చూడాలనుకోని వారెవరు? ఉంటారన్న సందేహం రావొచ్చు. తాజా ఉదంతానికి వస్తే.. ఆ చిన్నారి మాయదారి రోగానికి గురై.. తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న పాప.. నెమ్మదిగా చావు కబంధ హస్తాల్లోకి వెళ్లిపోతోంది. ఇలాంటి వేళ ఆ చిన్నారి చివరి కోరిక ఏమిటో తెలుసా? పవన్ కల్యాణ్ ను కలవటం.. ఆయనతో మాట్లాడటమేనని చెబుతోంది.

నెల్లూరు భగత్ సింగ్ కాలనీకి చెందిన విజయ్.. కామాక్షి దంపతులకు 12 ఏళ్ల యశశ్విని.. మరో కుమారుడు ఉన్నారు. పెయింటింగ్ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేస్తుంటాడు. అలాంటి వ్యక్తికి కాలం పెద్ద పరీక్షే పెట్టింది. ఏడాది క్రితం వరకు హుషారుగా ఉండే యశశ్విని ఉన్నట్లుండి ఒక్కసారిగా అనారోగ్యానికి గురికావటం.. ఎంతమంది వైద్యుల వద్దకు తీసుకెళ్లినా ఫలితం లేని పరిస్థితి. కుమార్తె ఆరోగ్యం కోసం అదే పనిగా ఖర్చు చేసి అప్పులపాలై పోయారు.

ఇదిలా ఉంటే.. ఈ బాలిక గురించి..ఆమె చివరి కోరిక గురించి తెలిసి కదిలిపోయిన వారు మీడియాకు సమాచారం ఇచ్చారు. ఏ క్షణంలో ఏమవ్వుతుందో తెలీని చిన్నారిని పవన్ కలుస్తారా? ఆమెలో స్థైర్యాన్న నింపుతారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇంతకీ యశశ్విని గురించి.. ఆమెకు తనను ఎంత పిచ్చిగా అభిమానిస్తుందో పవన్ కు ఎప్పుడు తెలుస్తుందో చూడాలి.