Begin typing your search above and press return to search.
పెద్దన్నకు దిమ్మ తిరిగే షాకిచ్చిన డ్రాగన్
By: Tupaki Desk | 12 March 2016 4:41 AM GMTపెద్దన్న పేరుతో తన ప్రయోజనాలకు తగ్గట్లు వాదన వినిపించే అమెరికా తీరును అంతర్జాతీయ వేదిక మీద ఎండగట్టే సాహసం ఇప్పటివరకూ పెద్దగా జరిగింది. లేదు. తాజాగా అలాంటి ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. పెద్దన్న తీరును కడిగిపారేయటమే కాదు.. మీరా మాకు చెప్పేదంటూ మండిపడటమే కాదు.. ముందు మీరు చేసే ఆరాచకాల సంగతేమిటంటూ చైనా కడిగేయటం సంచలనంగా మారింది.
ప్రపంచంలోని పలు దేశాల్లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతుందని తెగ వర్రీ అయిపోయే అమెరికా.. తన దేశంలో జరిగే వాటి గురించి పెద్దగా ప్రస్తావించదు. ఈ విషయంపై ప్రపంచంలోని పలు దేశాలకు ఆగ్రహం ఉన్నా.. దీనిపై నోరెత్తి మాట్లాడే ధైర్యం ఎవరికి లేదు. ఆ లోటును తీరుస్తూ తాజాగా చైనా దౌత్యవేత్త పూ కాంగ్ గురువారం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తీవ్రంగా విమర్శించారు.
చైనాలో మానవహక్కులు కాలరాస్తున్నారంటూ అమెరికాతో సహా 11 దేశాల వాదనను తీవ్రంగా విభేదించిన చైనా.. ముందు మీ సంగతేమిటంటూ అమెరికాను వేలెత్తి చూపించటమే కాదు.. అమెరికా రాక్షసత్వాన్ని ఐక్యరాజ్యసమితి వేదిక మీద నుంచే తీవ్రస్థాయిలో విరుచుకుపడటం గమనార్హం. అమెరికా రాక్షసత్వానికి నిదర్శనంగా గ్వాంటెనామో జైళ్లు ఉదాహరణ అని.. అలాంటి చీకటి జైళ్లు అమెరికాలో చాలానే ఉన్నాయని.. అమెరికా అంటే రేప్ లు.. హత్యలకు నిలయంగా పేర్కొంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలపై అమెరికా ఎలా స్పందిస్తుందో చూడాలి.