Begin typing your search above and press return to search.

చైనాను భారతీయులు వీటో చేయాల్సిన టైమొచ్చింది

By:  Tupaki Desk   |   3 April 2016 3:48 AM GMT
చైనాను భారతీయులు వీటో చేయాల్సిన టైమొచ్చింది
X
పక్కలో బల్లెం అన్న మాటను డ్రాగన్ దేశమైన చైనా గురించి తరచూ అభివర్ణిస్తుంటారు. అదెంత నిజమన్న విషయాన్ని తాజాగా చోటు చేసుకున్న ఒక విషయంలో తన దుర్మార్గ వైఖరిని చైనా బయటపెట్టింది. భారత్ పట్ల తనకున్న ద్వేష భావాన్ని.. పాక్ పట్ల తనకున్న అపరిమితమైన ప్రేమను అంతర్జాతీయ వేదిక మీద ప్రదర్శించేందుకు ఏ మాత్రం వెనుకాడలేదు.

పఠాన్ కోట దాడికి కారణమైన జైషే మహ్మద్ చీఫ్ అయిన మసూద్ అజార్ ను నిషేధించాలంటూ ఐక్యరాజ్యసమితిలో ప్రతిపాదించిన తీర్మానంలో వీటో చేసే అవకాశం ఉన్న చైనా తనకున్న విశేష అధికారాల్ని ఉపయోగించి భారత్ కు వ్యతిరేకంగా ఓటు వేసింది. సాంకేతిక కారణాలు చూపుతూ భారత్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ వీటో చేసిన చైనా తీరుపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అజార్ ఉగ్రవాది కాదని.. అందుకే అతడిపై నిషేధం విధించటానికి తాము వీటో చేస్తున్నట్లు ప్రకటించింది. ఇదంతా పాక్ నడిపిన రాయబారానికి ప్రతిఫలంగా చెబుతున్నారు. చైనా తీరు మీద భారత్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

ప్రభుత్వ స్థాయిలో ఇలాంటి ఆగ్రహాలు వ్యక్తం చేయం.. చైనా వాటిని లైట్ తీసుకోవటం మామూలే. అయితే.. ఈ విషయంలో దేశ ప్రజలంతా ఒక్కటి కావాల్సిన అవసరం ఉంది. భారత్ ప్రయోజనాల్ని దెబ్బ తీసేలా వ్యవహరించి.. అంతర్జాతీయ సమాజంలో భారత్ ను దెబ్బ తీసేలా వ్యవహరించిన చైనా విషయంలో భారతీయులు రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది. చైనా పొగరంతా దాని ఆర్థిక బలాన్ని చూసుకునే. అలాంటి బలం మీద దెబ్బ కొట్టే ఏ చిన్న విషయాన్ని భారతీయులు వదిలపెట్టకూడదనే చెప్పాలి. కానీ.. ఇంత పెద్ద దేశంలో ఇలాంటి భావనలు సామూహికంగా స్పందించే అవకాశాలు తక్కువ.

కానీ.. చైనా ఆర్థిక ప్రయోజనాలకు మేలు జరిగే ఏ చిన్న అవకాశాన్ని ఎవరికి వారుగా వ్యతిరేకించటం ద్వారా.. చైనా వస్తు సామాగ్రిని కొనుగోలు చేయకుండా ఉండటం ద్వారా చైనాను దెబ్బ తీసే అవకాశం ఉంది. కానీ.. చైనా ఉత్పత్తులు వాడకుండా ఉండలేని పరిస్థితుల్లో ఉన్న దేశ ప్రజలు.. చైనాను దెబ్బ తీసేందుకు ఒకే మాట మీద ఉండే అవకాశం ఉందా? అన్నది పెద్ద ప్రశ్న. ఏమైనా.. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించిన చైనాను దెబ్బ తీసే ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టకూడదన్న విషయాన్ని మర్చిపోకూడదు.