Begin typing your search above and press return to search.
భారత్‌లో రెండో కరోనా వైరస్ కేసు - ఇటీవలే చైనా నుంచి వచ్చిన వ్యక్తి
By: Tupaki Desk | 3 Feb 2020 1:30 AM GMTచైనాలో 300 మందికి పైగా పొట్టన పెట్టుకున్న కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా చైనాలో 304 మందికి పైగా మృతి చెందారు. 14వేల మందికి పైగా వైరస్ సోకి - చికిత్స పొందుతున్నారు. మరో 4,562 మంది అనుమానితులకు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచారు. మూడు వందల మందికి పైగా ఈ వైరస్ బారి నుంచి బయటపడ్డారు. చికిత్స అనంతరం వారు ఆసుపత్రి నుంచి బయటకు వచ్చారు. ఈ వైరస్ కారణంగా ప్రపంచం వెలుపల కూడా ఓ మరణం సంభవించింది. ఫిలిప్పీన్స్ లో కరోనా సోకి ఒకరు మృతి చెందారు.
ఈ వైరస్ భారత్ ను కూడా వణికిస్తోంది. తాజాగా కేరళలో రెండో కరోనా కేసు నమోదయింది. బాధితుడిని అలప్పుజ మెడికల్ కాలేజీలోని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అతని ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఈ వైరస్ సోకిన వ్యక్తి ఇటీవల చైనాలో పర్యటించాడు. ఇతను జనవరి 24న చైనా నుంచి భారత్ తిరిగి వచ్చారు. ఇంతకుముందే కేరళలోనే తొలి కరోనా వైరస్ కేసు నమోదయింది. తొలి బాధితురాలు చైనాలోని వూహాన్ నగరంలో చదువుకుంటున్నారు.
కరోనా వైరస్ కారణంగా వూహాన్ నగరంలో ఎవరూ బయటకు రావడం లేదు. అత్యవసరమైతే ముఖానికి మాస్కులు ధరించి గానీ బయటకు రావడం లేదు. భారత్ తొలి కరోనా వైరస్ బాధితురాలు అదే వూహాన్ నగర్ నుంచి వచ్చారు. వైరస్‌కు భయపడి కేరళకు తిరిగి వచ్చారు. కానీ అప్పటికే ఆమెకు వైరస్ సోకింది. ఈ మేరకు నమూనా తీసుకొని పుణేకు పరీక్షల నిమిత్తం పంపించగా వ్యాధి సోకిన విషయం వెలుగు చూసింది. ఈమెకు కూడా ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు.
తాజా కేసుతో భారత్ లో ఇద్దరికి కరోనా వైరస్ సోకినట్లయింది. ఈ రెండు కేసులు కూడా కేరళలోనే నమోదయ్యాయి. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి నిలకడగానే ఉంది. వీరితో పాటు ఇటీవల చైనా నుంచి వచ్చిన 1793 మందికి ముందు జాగ్రత్త చర్యగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో దాదాపు డెబ్బై మందికి ఆసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు.