Begin typing your search above and press return to search.
అమ్మా.. ఇంత కూర ఉంటే వేయమ్మా.. అగ్ర దేశం పరిస్థితి!?
By: Tupaki Desk | 15 April 2022 3:11 AM GMTప్రపంచంలోనే అమెరికా తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న చైనా దేశం ఇప్పుడు ఆకలికేకలు అర్రులు చాస్తోంది. కరోనా వైరస్ కు పుట్టినిల్లు అయిన ఈ దేశం ఇప్పుడు ఆ మహమ్మారి ధాటికి చిగురుటాకులా వణుకుతోంది. చైనాలోనే అతిపెద్ద నగరం షాంఘైలో పరిస్థితులు భయానక పరిస్థితులు నెలకొన్నాయి. జీరో కోవిడ్ విధానంలో భాగంగా చైనా ప్రభుత్వం అక్కడ కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది.
దీంతో చైనా ప్రజలు కనీసం ఆహారం తెచ్చుకునేందుకు కూడా అవకాశం లేకుండా ఆంక్షలు అమలు చేస్తోంది. ఆహారం లేక.. అందించేవారు లేక ప్రజలు ఆకలితో అలమటిస్తూ చనిపోవడం కంటే ఆత్మహత్య శరణ్యమంటూ ఆక్రందనలు చేస్దున్నారు. కనీసం జైలుకెళితే అయినా కడుపు నిండుతుందనే ఆశతో తమను అరెస్ట్ చేయండంటూ పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇక మరీ దారుణం ఏంటంటే.. కరోనా బారినపడిన వారి ఇళ్లలోని పెంపుడు జంతువులను సిబ్బంది కొట్టిచంపుతున్నారు. ఇటువంటి దారుణాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక ఆస్పత్రుల్లో అరకొర వసతులు.. చెత్తాచెదారంతో ఇబ్బందులు పడుతున్నామని బాధితులు చెబుతున్నట్టు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
షాంఘైలో భారీగా కరోనా కేసులు వెలుగులోకి వస్తుండడంతో మార్చి 28వ తేదీ నుంచి కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. దీంతో నిత్యావసర వస్తువులు లభించక.. ఆహారం దొరక్క లక్షలాది మంది ప్రజలు అల్లాడుతున్నారు. ఇళ్లలోని బాల్కనీలు, కిటికీల్లోంచి అరుపులు, పాటలతో నిరసన తెలుపుతున్నారు. మమ్మల్ని కాపాడండి.. ఆకలితో బతకడం కష్టంగా ఉంది అంటూ అధికారులను వేడుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఇక అధికారులు సరఫరా చేస్తున్న ఆహార వస్తువులు చాలక మార్కెట్లను లూటీ చేస్తున్న ఘటనలు ఇటీవల చైనాలో పెరిగిపోయాయి.
కరోనా బారినపడ్డ ఇళ్లలో పెంపుడు జంతువులను అధికారులు కొట్టి చంపుతున్న దారుణమైన వీడియోలు వెలుగుచూశాయి. షాంఘైలోని పుడోంగ్ లో ఓ పెంపుడు కుక్కను ఆరోగ్య కార్యకర్త పారతో కొట్టి చంపుతున్న వీడియో వైరల్ అయ్యింది. క్వారంటైన్ లో ఉన్న బాధితుల ఇళ్ల తాళాలను పగులకొట్టి మరీ వారి పెంపుడు చంతువులను చంపుతున్నట్టు సమాచారం. మొత్తం చైనా లాక్ డౌన్ వేళ ఆకలి చావుల కంటే ఆత్మహత్యే శరన్యమంటూ తాజాటి టియాంజిన్ కు చెందిన ఓ వ్యక్తి తన భార్యతో కలిసి అపార్ట్ మెంట్ కిటీకీలోంచి దూకి ప్రాణాలు తీసుకున్నారు.
చైనాలోనే అత్యంథ ధనిక జనాభా కలిగిన నగరం షాంఘై. దీని జనాభా 2.60 కోట్లు ఇక్కడి ప్రజలు ఆకలితో అలమటించడం.. మూగజీవాలను కొట్టిచంపడం లాంటి దారుణాలు అందరినీ కలవరపెడుతున్నాయి.