Begin typing your search above and press return to search.
భారత్ సాయం పొందటం చైనా కి ఇష్టం లేదా?
By: Tupaki Desk | 22 Feb 2020 1:10 PM GMTకరోనా వైరస్ దెబ్బతో చైనా మొత్తం చిగురుటాకులా వణికిపోతోంది. దీనితో కష్టాల్లో ఉన్న పొరుగు దేశానికి తన వంతు సాయం చేయాలని అనుకున్న భారత్..చైనా కి ఆపన్న హస్తం అందించింది. చైనాకు సంఘీ భావం తెలుపుతూ భారత ప్రధాని దేశ ప్రజల తరఫున ఓ లేఖ రాశారు. ఎటువంటి సహాయం చేయడానికైనా సిద్ధం అని హామీ ఇచ్చారు. ఈ హామీని నిలబెట్టుకుంటూ చైనాకు అవసరమైన మందులు, ఇతర వైద్య సామాగ్రిని ప్రత్యేక సైనిక రవాణా విమానం(సీ-17 గ్లోబ్ మాస్టర్) ద్వారా పంపించేందుకు రంగం సిద్ధం చేశారు.
మాములుగా అయితే , ఈ విమానం ఫిబ్రవరి 20న ఢిల్లీ నుంచి బయలుదేరాల్సి ఉంది. తిరుగు ప్రయాణంలో.. చైనాలో చిక్కుకుపోయిన భారతీయుల్ని స్వదేశానికి తరలించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకూ ఈ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దీనికి గల కారణం, చైనా నుంచి అవసరమైన అనుమతులు రాకపోవడమే. ఈ విషయంలో భారత అధికారులు చైనాతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. కానీ , చైనా మాత్రం, మా తరఫునుంచి ఎటువంటి ఆలస్యం లేదని చెబుతూనే ఉంది. దీంతో చైనా ఉద్దేశపూర్వకంగానే భారత్ కు సాయానికి మోకాలు అడ్డుపెడుతుందా? ఈ విషయంపై భారత ప్రభుత్వ ఉన్నత వర్తాలు ఈ విధంగా స్పందిస్తున్నాయి.
కొవిడ్-19 కారణంగా ఇబ్బందులు పడుతున్న చైనాకు భారత ప్రధాని దేశ ప్రజల తరఫున సంఘీభావం తెలుపుతూ ఇటీవల ఓ లేఖ రాశారు. మరోవైపు భారత - చైనా దౌత్యసంబంధాలు ఏర్పడి 70 సంవత్సరాలు కావస్తున్న నేపథ్యంలో ప్రధాని.. తను ఇచ్చిన మాటను నెలబెట్టుకుంటూ చైనా కోసం ఓ ప్రత్యేక విమానాన్ని సిద్ధం చేశారు. దాని ద్వారా చైనాకు అవసరమైన మాస్క్ లు, డీఫ్రిబ్రిల్లేటర్స్, ఇన్ ఫ్యూజన్ పంపులు - ఇతర వైద్య పరికరాలు పంపించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వీటి విషయంలో భారత్ కొరత ఎదుర్కొంటున్నప్పటికీ మన ప్రభుత్వం చైనాను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. మరోవైపు.. స్వదేశానికి ఎప్పుడు తిరిగి వస్తామా అంటూ చైనాలోని భారతీయులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కానీ అనుమతుల విషయంలో జరుగుతున్న ఆలస్యం కారణంగా వారితో పాటు భారత్ లోని వారి కుటుంబ సభ్యులు కూడా ఎంతో మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. ఇతర దేశాలకు చెందిన విమానాలు మాత్రం యథావిథిగా చైనా నుంచి విదేశస్తులను తరలిస్తున్నాయి.