Begin typing your search above and press return to search.
ఈశాన్య భారతంపై చైనా కుయుక్తులు
By: Tupaki Desk | 23 Aug 2020 12:30 AM GMTచైనా దేశం భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతోంది. అరుణాచల్ ప్రదేశ్ నుంచి లఢక్ వరకు భారత సైన్యంతో గొడవలకు దిగుతోంది. వ్యూహాత్మక దాడితో భారత్ ను దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతోంది.
ఈశాన్య భారతదేశంలో ముఖ్యంగా నాగాలాండ్ లాంటి రాష్ట్రాల్లో భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే తీవ్రవాద గ్రూపులకు చైనా గుట్టుగా సాయం చేస్తోందన్న ఆరోపణలున్నాయి. తాజాగా క్రిస్టియన్లు ఎక్కువగా ఉన్న నాగాలాండ్ ను చైనా టార్గెట్ చేసుకున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఏసు క్రీస్తు ఓ చైనా మహిళ రూపంలో భూమ్మీదకు తిరిగి వచ్చాడని క్రైస్తవానికి చెందిన ఓ మత శాఖ ప్రచారం చేస్తోంది. యాంగ్ జియాంగ్ బిన్ లేదా లైటనింగ్ డెంగ్ అనే మహిళ రూపంలో క్రీస్తు భూమ్మీదకు వచ్చాడని ఓ మతశాఖ ప్రచారం చేస్తోంది.
ముఖ్యంగా యువతను తమ వైపు తిప్పుకునేలా ఈ మత శాఖ ప్రయత్నిస్తోంది. చైనీయులే దీన్ని నిర్వహిస్తున్నారు. నాగాలాండ్ వాసులు. ఈశాన్య రాష్ట్రాల వారు ఈ మతశాఖలో చేరడం ఆందోళన కలిగిస్తోంది.
ఈ మతశాఖను అడ్డుకోవాలని భారత ప్రభుత్వం నాగాలాండ్ బాపిస్టు సంఘాలకు సూచిస్తోంది. తప్పుడు సువార్తను ప్రచారం చేస్తోందని చెబుతోంది.