Begin typing your search above and press return to search.

చైనాలో వైర‌స్‌పై విచార‌ణ‌కు వెళ్తే సాక్ష్యం మాయం

By:  Tupaki Desk   |   28 July 2020 11:10 AM GMT
చైనాలో వైర‌స్‌పై విచార‌ణ‌కు వెళ్తే సాక్ష్యం మాయం
X
ప్ర‌స్తుతం మాన‌వ ప్ర‌పంచాన్ని స్ట్రెచ‌ర్‌పై కూర్చొపెట్టిన ప్రాణాంత‌క వైర‌స్‌కు జ‌న్మ‌నిచ్చిన దేశం చైనా. ఆ దేశంలోని వూహాన్ న‌గ‌రంలో మ‌హ‌మ్మారి పురుడు పోసుకుని నేడు ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. అలాంటి ప్ర‌మాద‌క‌ర వైర‌స్‌కు జ‌న్మ‌నిచ్చిన చైనా తీవ్ర విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. దీనిపై ప్ర‌పంచ‌దేశాల‌న్నీ చైనాపై గుర్రుగా ఉన్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు మ‌రోసారి చైనా ఇరుకున ప‌డేలా ఓ ప‌రిణామం చోటుచేసుకుంది. ఆ వైర‌స్‌కు జ‌న్మ స్థాన‌మైన వూహాన్ న‌గ‌రంలో ఆ వైర‌స్ పుట్టుక‌కు కార‌ణ‌మేంటి? ఎలా వ‌చ్చింది? ఎలా వ్యాప్తి చెందిన‌ది అనే దానిపై అధ్య‌య‌నం చేయ‌డానికి ఓ అంత‌ర్జాతీయ బృందం వెళ్ల‌గా అప్ప‌టికే ఆ న‌గ‌రంలో వైర‌స్‌కు సంబంధించిన ల‌క్ష్యాలు మాయ‌మ‌య్యాయ‌ని ఆ బృందం ప్ర‌క‌టించింది.

వూహాన్‌లో వైర‌స్ వ్యాపిస్తోందని జనవరిలోనే ప్రకటించిన చైనా వైద్యుడు క్వోక్‌ యుంగ్‌ యువెన్ చెప్ప‌డంతో చైనా ఇరుకున ప‌డిన విషయం విధిత‌మే. దీనికి సంబంధించి వూహాన్‌ నగరంలోని హ్వానాన్‌ వన్యప్రాణి మార్కెట్‌లో దర్యాప్తు చేసేందుకు జనవరి 17వ తేదీన వెళ్లిన చైనా నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ శాస్త్రవేత్తల బృందానికి చుక్కెదురైంది. ఆ బృందానికి క్వోక్ యుంగ్ యువెన్ నేతృత్వం వహించారు. అక్క‌డ‌కు వెళ్లిన స‌మ‌యంలో జ‌రిగిన ప‌రిణామాలు తాజాగా ప్ర‌పంచానికి చెప్పారు. తాము మార్కెట్‌కు వెళ్లేసరికి అక్కడి పరిసరాలన్నీ నిర్మానుష్యంగా మారాయని, స్థానిక అధికారులే ఖాళీ చేయించారని విచారణలో తెలిసిందని యువెన్ ప్ర‌క‌టించారు. దీంతో ఇన్ఫెక్షన్‌ మనుషులకు ప్రబలడానికి కారణభూతమైన కీలక ఆధారాన్ని గుర్తించే వీలు లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివ‌ల‌న తాము ద‌ర్యాప్తు చేయ‌డానికి అవ‌కాశ‌మే లేకుండా పోయింద‌ని తెలిపారు.