Begin typing your search above and press return to search.
పాక్ గురించి చైనా ఏం చెప్పిందంటే.
By: Tupaki Desk | 24 Aug 2017 12:54 PM GMTపాకిస్థాన్ విషయంలో చైనా తన ప్రేమను మరోసారి కుండల కొద్దీ కురిపించింది. ఇటీవలే పాక్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ స్థాయిలో ఏకేశాడు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందని, పాక్ ఉగ్రస్థావరంగా మారిపోయిందని, ఇలాగైతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించాడు కూడా. ఆ సమయంలోనే స్పందించిన చైనా.. పాకిస్థాన్ అలాంటిదేమీ కాదని, పాక్ కూడా ఉగ్ర బాధిత దేశమేనని వెనుకేసుకు వచ్చింది. ఇక, ఇప్పుడు మరోసారి కూడా పాక్.. చైనాపై ప్రేమను కురిపించింది. పాకిస్థాన్ సార్వభౌమాధికారాన్ని అగ్రరాజ్యం గౌరవించాలని చైనా సుద్దులు చెప్పింది.
అంతేకాదు, ఉగ్రవాదులు - శాంతి సుస్థిరతల విషయంలో పాక్ పడుతున్న ఆందోళనను - ఆవేదనను అమెరికా అర్ధం చేసుకుని గౌరవించాలని సూచించింది. ఈ మేరకు చైనా స్టేట్ కౌన్సిలర్ యాంగ్ జిచి అమెరికా విదేశాంగ కార్యదర్శి టిల్లర్ సన్ తో ఫోన్ మాట్లాడారు. పాక్ అలాంటిదేమీ కాదని, ఉగ్రవాదులను తరిమి కొట్టడంలో ముందుందని పేర్కొన్నారు. అంతేకాదు, ఇప్పటికే కొన్ని వందల మంది పౌరులను - సైనికులను కూడా పాక్ ఈ ఉగ్ర పోరులో త్యాగం చేసిందని చైనా చెప్పుకొచ్చింది.
అమెరికా కోరుకుంటున్నట్టు.. ఆప్ఘనిస్తాన్ పరిణామాల్లో పాక్ క్రియాశీలక పాత్ర పోషిస్తుందని యాంగ్ వివరించినట్టు చైనా వార్తా సంస్థ వెల్లడించింది. ఆఘ్ఘన్ వ్యవహారాల్లో పాక్ చూపిన చొరవను పరిగణనలోకి తీసుకోవాలని కూడా అమెరికా కు సూచించినట్టు పేర్కొంది. ఉగ్రవాదంపై పోరు విషయంలో పాకిస్తాన్ రాజీలేని పోరు కొనసాగిస్తున్నదని తెలిపింది. కాగా, ఇలా .. పాక్ విషయంలో చైనా వెనకేసుకు రావడం ఇది కొత్తేంకాదు. గతంలోనూ పాక్ పై ఎలాంటి ఆరోపణలూ లేకుండా చైనా వెనుకేసుకు వచ్చింది. తాజా పరిణామాలతో పాక్-చైనాల మధ్య ఎంత రేంజ్ లో బంధాలున్నాయనే విషయం స్పష్టమైంది.