Begin typing your search above and press return to search.

బుల్ డోజర్లతో గాల్వన్ నదిని మళ్లిస్తున్న చైనా!

By:  Tupaki Desk   |   19 Jun 2020 5:30 AM GMT
బుల్ డోజర్లతో గాల్వన్ నదిని మళ్లిస్తున్న చైనా!
X
ఇప్పటికే 20 మంది భారత సైనికులను చంపిన చైనా మరో దురాగతానికి ఒడిగడుతోంది. తాజాగా ఉపగ్రహ చాయచిత్రాల ద్వారా వెలుగులోకి డ్రాగన్ దుశ్చర్యలు బయటపడుతున్నాయి. భారత్-చైనా మధ్య సరిహద్దుల్లో ఉన్న గాల్వన్ నదిలోయ సమీపంలో చైనా భారీ సంఖ్యలో బుల్ డోజర్లను తీసుకువచ్చి ఏకంగా గాల్వన్ నదీ ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నించింది. ఇందుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను ఒక జాతీయ మీడియా సంస్థ బయటపెట్టింది. దీంతో చైనా దారుణాలు వెలుగుచూశాయి.

భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణలు జరిగిన ప్రాంతానికి అర కిలోమీటరు దూరంలోని ఈశాన్య లడ్డఖ్ లో గాల్వన్ ప్రాంతంలో బుల్ డోజర్లతో నదీ ప్రవాహాన్ని తగ్గించేందుకు.. మళ్లించేందుకు చైనా ప్రయత్నించింది.

చైనా సరిహద్దుల్లో ఏకంగా 5 కి.మీల పొడవునా బుల్ డోజర్లు, లారీలు, మిలటరీ రవాణా వాహనాలు నిలిపి నదీని మళ్లిస్తోంది. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా రెండు ప్రాంతాల్లో తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేసుకుంది. పక్కాగా కుట్ర పన్నీ మరీ ఇనుప రాడ్లతో భారత సైనికులపై దాడి చేసినట్టు వెల్లడైంది.