Begin typing your search above and press return to search.

కరోనా గురించి మరో భయంకరమైన వాస్తవం

By:  Tupaki Desk   |   2 April 2020 5:00 AM IST
కరోనా గురించి మరో భయంకరమైన వాస్తవం
X
కరోనా ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనకు గురి చేస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా వైరస్‌ కు వ్యాక్సిన్‌ కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా వైరస్‌ వయసు పైబడిన వారిని.. అనారోగ్య సమస్యలు ఉన్న వారిని మాత్రమే చంపేస్తోంది. పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉన్న వారు రెండు మూడు వారాల్లో కరోనా నుండి బయట పడుతున్నారు. ఈ విషయం కాస్త ఉపశమనం కలిగించే విషయమే అయినా ఇప్పుడు మరో భయంకర విషయంను చైనా శాస్త్రవేత్తలు గుర్తించారు.

కరోనా వైరస్‌ టెస్టు నెగటివ్‌ వచ్చినా కూడా మనిషి శరీరంలో ఏదో ఒక భాగంలో కరోనా వైరస్‌ ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా పాజిటివ్‌ వచ్చిన వారి మలం ఇంకా కళ్లలో కరోనా వైరస్‌ ను గుర్తించినట్లుగా శాస్త్రవేత్తలు ప్రకటించారు. కోవిడ్‌ టెస్టు నెగటివ్‌ వచ్చిన వారికి నెల రోజుల తర్వాత మలం ఇంకా కళ్లెను పరీక్షించిన శాస్త్రవేత్తలకు షాకింగ్‌ విషయాలు తెలిశాయట. అప్పటికి కూడా ఇంకా కరోనా వైరస్‌ వారిలో లక్షణాలు బయటకు వచ్చినట్లుగా వారు చెబుతున్నారు.

రిపోర్ట్‌ లో నెగటివ్‌ వచ్చినంత మాత్రాన పూర్తిగా కరోనా వైరస్‌ నుండి బయట పడ్డట్లుగా కాదంటూ శాస్త్రవేత్తలు చెబుతున్న విషయం భయంను కలిగిస్తోంది. కోవిడ్‌ 19 గురించి ముందు ముందు మరెన్ని భయంకర విషయాలను తెలుసుకోవాల్సి వస్తుందో అంటూ భయాందోళన వ్యక్తం అవుతోంది.