Begin typing your search above and press return to search.
చైనాలో భారతీయుడికి అవమానం!
By: Tupaki Desk | 14 Aug 2017 4:23 AM GMTరెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్న వేళ.. రెండు దేశాలకు చెందిన వారు ఆచితూచి వ్యవహరించాల్సిందే. అయితే.. అందుకు భిన్నమైన ఉదంతం ఒకటి చైనాలో చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. చైనాలోని ఒక విమానాశ్రయంలో ఒక భారతీయుడికి చేదు అనుభవం ఎదురైందని.. అవమానించేలా వ్యవహరించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
షాంఘై పుడాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఒక ఉదంతం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. నార్త్ అమెరికన్ పంజాబీ అసోసియేషన్ ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ సత్నం సింగ్ ప్రయాణంలో భాగంగా చైనాకు వెళ్లారు. ఆయన షాంఘై విమానాశ్రయంలోని ఎగ్జిట్ గేటు దగ్గర విమాన సిబ్బంది అవసరం లేకున్నా.. తిట్టినట్లుగా ఫిర్యాదు చేశారు.
ఆగస్టు 6న ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్లాల్సి ఉంది. చైనా ఎయిర్ పోర్ట్ లో దిగిన ఆయన.. మరో విమానం ఎక్కాల్సి ఉంది. ఈ నేపథ్యంలో విమాన సిబ్బంది అవమానించే రీతిలో వ్యవహరించారని చెబుతున్నారు.
దీనికి సంబంధించిన వివరాలు ఇప్పటికే కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ దృష్టికి తెచ్చినట్లుగా చెబుతున్నారు. చైనా విమానాశ్రయ సిబ్బందిపై సదరు ప్రయాణికుడు ఢిల్లీలో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా.. తమ విమాన సిబ్బంది ఎవరూ అవమానకరరీతిలో వ్యవహరించలేదని చైనా అధికారులు వాదిస్తున్నారు.